విరాట్ కోహ్లీకి 'ప్యూమా' ప్రత్యేక బహుమతి ఏంటో తెలుసా?

మెగా టోర్నీ ప్రపంచకప్ సమరం ఈ నెల 30న ప్రారంభం కానుంది. ఈ టోర్నీ కోసం టీమిండియా బుధవారం ఇంగ్లాండ్ గడ్డపై అడుగుపెట్టింది. ఈ నెల 25న ఓవల్ మైదానంలో న్యూజిలాండ్‌తో భారత్ తమ తొలి ప్రా క్టీస్ మ్యాచ్ ఆడుతుంది. 28న కార్డిఫ్‌లో రెండో ప్రాక్టీస్ మ్యాచ్ బంగ్లాదేశ్‌తో ఆడనుంది. జూన్ 5న దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్‌తో భారత్ తమ ప్రపంచకప్ పోరును మొదలు పెడుతుంది. టోర్నీలో భారత్ టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

ప్రత్యేక బహుమతి:
ఈ ప్రపంచకప్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది కోహ్లీకి మూడో ప్రపంచకప్ కాగా.. మొదటసారి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. మరోవైపు ప్రపంచకప్‌లో 7వ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇన్ని ప్రత్యేకతలు మధ్య స్పోర్ట్స్ వేర్ దిగ్గజ సంస్థ 'ప్యూమా' నుండి కోహ్లీ ప్రత్యేక బహుమతిని అందుకున్నాడు.
150 జతలు మాత్రమే:
షూ తయారీ బ్రాండ్ ప్యూమా వన్8 క్రికెట్ షూస్ పేరిట సరికొత్త లిమిటెడ్ ఎడిషన్‌ను రూపొందించింది. బంగారపు రంగులో ప్రత్యేకంగా తయారు చేసిన గోల్డెన్ షూ కిట్ ను ఇంగ్లాండ్ వెళ్లే ముందు కోహ్లీకి బహుమతిగా అందించింది. విరాట్ కోహ్లీ ఈ షూలనే ధరించి ఇంగ్లాండ్ మైదానాల్లో కనువిందు చేయనున్నారు. అయితే కంపెనీ కేవలం 150 జతలు మాత్రమే అందుబాటులోకి తెచ్చిందట.

చరిత్ర సృష్టిస్తానో చూద్దాం:
'నా ప్యూమా ఫామిలీ సంస్థ నుండి ఈ ప్రత్యేక కిట్ అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రపంచకప్ లాంటి పెద్ద టోర్నీలో ఈ షూలతో ఆడేందుకు ఎదురుచూస్తున్నా. నాకు వైట్, గోల్డ్ కలర్లు అంటే ఇష్టం. ఈ కొత్త డిజైన్ బాగుంది. వీటితో చరిత్ర సృష్టిస్తానో చూద్దాం' అని విరాట్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications