Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జునైద్‌ఖాన్‌ వినూత్న నిరసనపై అఫ్రిదీ ఏమన్నాడంటే!!

ICC Cricket World Cup 2019: Probably I would have done the same says Shahid Afridi, reacts after Junaid Khan’s tape protest

ప్రపంచకప్‌-2019లో చోటు దక్కకని పాకిస్థాన్ పేసర్‌ జునైద్‌ ఖాన్‌ వ్యక్తం చేసిన నిరసన సరైంది కాదు. అయితే అతడి స్థానంలో నేను ఉన్నా ఇలాగే చేసేవాడిని అని పాక్ మాజీ కెప్టెన్‌, ఆల్‌రౌండర్‌ షాహిద్‌ అఫ్రిదీ పేర్కొన్నాడు. ప్రపంచకప్‌ కోసం పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డు తొలుత 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. అందులో జునైద్‌ ఖాన్‌ ఉన్నాడు.

నిజం ఎప్పుడూ చేదే:

నిజం ఎప్పుడూ చేదే:

తాజాగా ముగిసిన ఇంగ్లండ్‌ సిరీస్‌లో పేలవ ప‍్రదర్శన కారణంగా గత సోమవారం ప్రకటించిన తుది జట్టులో జునైద్‌ఖాన్‌ చోటు కోల్పోయాడు. దీంతో మనస్తాపం చెందిన అతను ట్విటర్‌ వేదికగా వినూత్న నిరసన వ్యక్తం చేశాడు. నోటికి బ్లాక్‌ ప్లాస్టర్ అంటించుకుని ఉన్న ఓ ఫొటోను తన ట్విట్టర్‌లో షేర్‌ చేసాడు. 'చెప్పడానికేమీ లేదు. ఎందుకంటే నిజం ఎప్పుడూ చేదుగా ఉంటుంది' అని రాసుకొచ్చాడు. ఈ విషయం పాక్ బోర్డుకు తెలియడంతో సీరియస్‌ అయింది. పరిస్థితి చేయిదాటిపోతోందని గ్రహించిన జునైద్‌ ఆ ట్వీట్‌ను డిలీట్‌ చేశాడు.

నేనున్నా ఇలాగే చేసేవాడిని:

నేనున్నా ఇలాగే చేసేవాడిని:

తాజాగా ఈ విషయంపై షాహిద్‌ అఫ్రిదీ స్పందించాడు. 'జునైద్‌ వ్యక్తం చేసిన నిరసన సరైంది కాదు. అతను ఆ విధంగా చెయ్యాల్సి ఉండకూడదు. అయితే అతడి స్థానంలో నేనున్నా ఇలాగే చేసేవాడిని. జునైద్‌కు ఇంకా చాలా భవిష్యత్‌ ఉంది. అతడికి తొలి ప్రపంచకప్‌ కావడంతో నిరశాకు లోనయ్యుండొచ్చు. ఈ విషయంపై పీసీబీ వేరే నిర్ణయం తీసుకోవాల్సింది' అని అఫ్రిదీ పేర్కొన్నారు.

మూడు మార్పులు:

మూడు మార్పులు:

తొలుత ప్రకటించిన జట్టులో పీసీబీ మూడు మార్పులు చేసింది. పాకిస్తాన్‌ స్పీడ్‌స్టార్‌ మహ్మద్‌ అమిర్‌, వాహబ్‌ రియాజ్‌, అసిఫ్‌ అలీలకు ప్రపంచకప్‌ జట్టులో చోటు కల్పించింది. ఇక ఈ ముగ్గురి రాకతో అబిద్‌ అలీ, ఫహీమ్‌ ఆష్రఫ్‌, జునైద్‌ ఖాన్‌లు ఉద్వాసనకు గురయ్యారు. దీంతో ప్రపంచకప్‌ ఆడటం ఖాయమనుకున్న ఈ ముగ్గురు పీసీబీ నిర్ణయంతో షాక్‌కు గురయ్యారు.

పాకిస్తాన్‌ ప్రపంచకప్‌ జట్టు:

పాకిస్తాన్‌ ప్రపంచకప్‌ జట్టు:

సర్ఫరాజ్‌ అహ్మద్‌ (కెప్టెన్‌), ఫకార్‌ జమాన్‌, ఇమామ్‌ ఉల్‌ హక్‌‌, బాబర్‌ అజమ్‌, హ్యారిస్‌ సోహైల్‌, అసీఫ్‌ అలీ, షోయబ్‌ మాలిక్‌, మహ్మద్‌ హఫీజ్‌, ఇమాద్‌ వసీం, షాదాబ్‌ ఖాన్‌, హసన్‌ అలీ, షాహిన్‌ అఫ్రిదీ, మహ్మద్‌ అమిర్‌, వాహబ్‌ రియాజ్‌, మహ్మద్‌ హస్‌నైన్‌.

Story first published: Monday, May 27, 2019, 12:24 [IST]
Other articles published on May 27, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+