For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గతంలో ఎన్నడూ లేని విధంగా: వరల్డ్‌కప్ విజేత ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?

ICC Cricket World Cup 2019 : ICC Announces Mega Prize Money For Cricket World Cup 2019 || Oneindia
ICC Cricket World Cup 2019: Prize Money: Winner to get a purse of $4 million

మే 30 నుండి ఇంగ్లాండ్ అండ్ వేల్స్ వేదికగా ఐసీసీ మెగా టోర్నీ ప్రపంచకప్‌ సమరం జరగనుంది. ఈ ప్రపంచకప్‌లో విజేతగా నిలిచే జట్టుకు రూ. 28 కోట్లు (4 మిల్లియన్ డాల్లర్లు) ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్లు ఐసీసీ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఈసారి జ‌రిగే ప్రపంచకప్‌ చ‌రిత్ర‌లో నిలువనుంది. ఎందుకంటే ఇది అన్ని ప్రపంచకప్‌లోకెల్లా అత్యధిక ప్రైజ్ మనీ.

 ర‌న్న‌ర‌ప్‌కు 14 కోట్లు:

ర‌న్న‌ర‌ప్‌కు 14 కోట్లు:

విజేత‌కు ప్రైజ్ మనీతో పాటు ట్రోఫీని కూడా అందిస్తారు. లార్డ్స్‌ మైదానంలో జూలై 14వ తేదీన ఫైన‌ల్ మ్యాచ్ జరగనుంది. ప్రపంచకప్‌ టోర్నీ మొత్తం ప్రైజ్‌మ‌నీ 10 మిలియ‌న్ల డాల‌ర్లు. విజేతకు రూ. 28 కోట్లు కాగా.. ర‌న్న‌ర‌ప్‌కు 14 కోట్ల ప్రైజ్‌మ‌నీ లభించనుంది. ఇక సెమీఫైన‌ల్ చేరిన జ‌ట్ల‌కు 5 కోట్ల 61 ల‌క్ష‌లు ( 8 ల‌క్ష‌ల డాల‌ర్లు) ఇవ్వనున్నారు.

మెగా సమరం 46 రోజులు:

మెగా సమరం 46 రోజులు:

ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ కోసం ఇప్పటికే ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు అన్ని ఏర్పాట్లను సిద్దం చేసింది. ఈ వన్డే ప్రపంచకప్‌కు యునైటెడ్ కింగ్‌డమ్ ఆతిథ్యమివ్వడం ఇదే ఆరోసారి కావడం విశేషం. మొత్తం 10 జ‌ట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. వ‌ర‌ల్డ్‌క‌ప్ టోర్నీ 46 రోజుల పాటు జరుగుతుంది. ఇంగ్లండ్‌లోని 11 మైదానాల్లో ఈ మ్యాచ్‌లు జ‌రుగుతాయి. ఈనెల 30వ తేదీన నుంచి వ‌ర‌ల్డ్‌క‌ప్ మ్యాచ్‌లు మొద‌లవుతాయి. తొలి మ్యాచ్‌ ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతుంది.

రౌండ్ రాబిన్ పద్దతిలో:

రౌండ్ రాబిన్ పద్దతిలో:

మ్యాచులు అన్ని రౌండ్ రాబిన్ పద్దతిలో జరగనున్న విషయం తెలిసిందే. 1992 వరల్డ్‌కప్‌ను ఈ విధంగానే నిర్వహించారు. ఈ పద్ధతిన ప్రతి జట్టు 9 మ్యాచ్‌లు చొప్పున ఆడాల్సి ఉంటుంది. పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. సెమీఫైనల్లో రెండు జట్లు (1 vs 4, 2 vs 3) ఫైనల్ కు అర్హత సాధిస్తాయి.

జూన్ 16న హై ఓల్టేజ్ మ్యాచ్‌:

జూన్ 16న హై ఓల్టేజ్ మ్యాచ్‌:

జులై 9న జరిగే తొలి సెమీఫైనల్ మ్యాచ్‌కి ఓల్డ్ ట్రాఫోర్డ్ ఆతిథ్యమిస్తోంది. జులై 11న జరిగే రెండో సెమీ పైనల్ మ్యాచ్‌కి ఎడ్జిబాస్టన్ వేదిక కానుంది. ఫైనల్ మ్యాచ్‌కి ముందు రిజర్వ్ డే ఉంది. కాగా ఈ మెగా టోర్నీలో కోహ్లీసేన జూన్ 5న దక్షిణాఫ్రికాతో తన తొలి మ్యాచ్‌ ఆడనుంది. టోర్నీకే హై ఓల్టేజ్ మ్యాచ్‌గా నిలవనున్న భారత్-పాక్ మ్యాచ్ జూన్ 16న జరగనుంది. డే మ్యాచ్‌లు అన్ని భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నాం 2.30 గంటలకు ప్రారంభమవుతాయి. ఇక డే/నైట్ మ్యాచ్‌లు మాత్రం భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమవుతాయి.

Story first published: Friday, May 17, 2019, 15:59 [IST]
Other articles published on May 17, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+