ఐసీసీ టోర్నీ గెలిచే వరకు వారిని 'చోకర్స్' అనే పిలుస్తారు

ఐసీసీ వన్డే ప్రపంచకప్ టోర్నీ గెలిచే వరకు దక్షిణాఫ్రికా జట్టును 'చోకర్స్' అనే పిలుస్తారు అని ఆ జట్టు తొలి టెస్ట్ కెప్టెన్ కెప్లర్ వెసెల్స్ అన్నారు. సోమవారం వెసెల్స్ ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... 'ఐసీసీ టోర్నీ గెలిచేంత వరకు జనాలు దక్షిణాఫ్రికా జట్టును చోకర్స్ అని పిలుస్తూనే ఉంటారు. ఇది నిజం. 1999లో దక్షిణాఫ్రికాకు అత్యుత్తమమైన జట్టు ఉంది. అయినా ట్రోఫీ గెలవలేకపోయింది. చాలా దురదృష్టకరం' అని వెసెల్స్ పేర్కొన్నాడు.

సెమీస్ చేరే అవకాశం ఉంది:
'2019లో దక్షిణాఫ్రికా ఫేవరెట్ కాదు. అయినా వీరికి ఇది ఉపయోగపడే అంశమే. వారు ట్రోఫీ గెలుస్తారని చాలామంది అనుకోవట్లేదు. దీంతో ఎలాంటి ఒత్తిడి లేకుండా సులభంగా సెమీస్ చేరే అవకాశం ఉంది. పరిస్థితులు అనుకూలించి వారు బాగా ఆడితే ఫైనల్ వెళ్లొచ్చు. ఏబీ డివిలియర్స్ చాలా కీలకం. అతడు లేని లోటు తెలుస్తుంది. అయితే దానిని పూడ్చేందుకు జట్టులో మంచి ఆటగాళ్లు ఉన్నారు' అని వెసెల్స్ అన్నారు.

భారత్‌ను ఓడించడం చాలా కష్టం:
'భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలు ప్రపంచకప్‌లో ఫెవరెట్ జట్లు. సొంత గడ్డపై ఆడడం ఇంగ్లాండ్‌కు కొంత ఒత్తిడి ఉంటుంది. భారత్‌కు పటిష్ట వన్డే జట్టు ఉంది. ఆ జట్టును ఓడించడం చాలా కష్టం. భారత్‌లో నాలుగో స్థానంపై చర్చ జరుగుతోంది. కోహ్లీ ఆ స్థానంలో ఆడాలనుకుంటున్నా. భారత ఓపెనర్లు 10 పరుగుల్లోపు అవుట్ అయినా.. విరాట్ తన మార్క్ ఆటతో భారీ స్కోరు అందించగలడు' అని వెసెల్స్ అన్నాడు.

భారీ స్కోర్లు నమోదవొచ్చు:
'ప్రపంచకప్ జరిగే ఇంగ్లాండ్‌లో జూన్, జులై నెలలలో ఎండలు బాగా ఉంటాయి. ఇంగ్లాండ్- పాకిస్థాన్ సిరీస్ చూస్తే.. డే మ్యాచ్‌లలో 300-320 స్కోర్ వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అయితే వేదికలు, వాతావరణ పరితిత్తులను బట్టి ఎక్కువ స్కోర్ కూడా చొయొచ్చు. బౌలర్లు కూడా రాణించే అవకాశాలు మెండుగా ఉన్నాయి' అని వెసెల్స్ చెప్పుకొచ్చారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications