Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రపంచకప్‌.. సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డర్‌గా ఇంగ్లాండ్‌ కోచ్‌

ICC Cricket World Cup 2019: Paul Collingwood takes field during warm-up game after injury scares to England players

మాజీ కెప్టెన్, ప్రస్తుత ఇంగ్లాండ్‌ కోచ్‌ పాల్‌ కాలింగ్‌వుడ్‌ (42) సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డర్‌గా మైదానంలోకి వచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు. అదేంటి మ్యాచ్ జరుగుతుండగా ఎవరైనా ఆటగాడు గాయపడితే మరొక ఆటగాడు సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి వస్తాడు. ఇది అందరికి తెలిసిన విషయం. కానీ.. ఏకంగా కోచ్ సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డర్‌గా రావడం మాత్రం విశేషం.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

వివరాల్లోకి వెళితే... శనివారం ఆస్ట్రేలియాతో ఇంగ్లాండ్‌ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. వేలి గాయంతో కెప్టెన్‌ మోర్గాన్‌, బుజ గాయంతో స్పిన్నర్‌ ఆదిల్‌ రషీద్‌లు మ్యాచ్‌కు ముందే వైదొలిగారు. ఇక సీనియర్ బ్యాట్స్‌మన్‌ జోయ్ రూట్‌కు విశ్రాంతినిచ్చారు. ఫీల్డింగ్‌ చేస్తూ మార్క్‌వుడ్‌ గాయపడటంతో.. రూట్‌ ఫీల్డింగ్‌కు రావాల్సి వచ్చింది. అనంతరం జోఫ్రా ఆర్చర్‌ కూడా గాయపడ్డాడు. ఆటగాళ్లు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో.. కాలింగ్‌వుడ్‌ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చాడు. మార్క్‌వుడ్‌ జెర్సీ వేసుకుని కాలింగ్‌వుడ్‌ ఫీల్డింగ్ చేసాడు.

అనంతరం లక్ష్య ఛేదనలో రషీద్‌, ఆర్చర్‌లు బ్యాటింగ్ చేశారు. తప్పనిసరి పరిస్థితులలో వీరిద్దరూ బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఒక బంతి ఎదుర్కున్న ఆర్చర్‌ (1) రనౌట్ అవ్వగా.. రషీద్‌ (7) మాత్రం నాటౌట్ గా నిలిచాడు. కాలింగ్‌వుడ్‌ 2001-2011 మధ్య కాలంలో ఇంగ్లాండ్ తరపున 197 వన్డేలు ఆడాడు. 5000 పరుగులతో పాటు 111 వికెట్లు కూడా తీసాడు. 68 టెస్టులు, 36 టీ20లు కూడా ఆడాడు.

Story first published: Sunday, May 26, 2019, 17:04 [IST]
Other articles published on May 26, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+