న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాకిస్తాన్‌, శ్రీలంక మ్యాచ్.. వర్షం కారణంగా టాస్‌ నిలిపివేత

ICC Cricket World Cup 2019: Pakistan vs Sri Lanka: Toss delayed due to rain

ప్రపంచకప్‌లో భాగంగా బ్రిస్టల్‌ వేదికగా మరికొద్ది సేపట్లో పాకిస్తాన్‌, శ్రీలంక జట్లు మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే బ్రిస్టల్‌ మైదానంలో వర్షం కురుస్తుండటంతో అంపైర్లు టాస్‌ని నిలిపివేశారు. దీంతో మ్యాచ్‌ ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. భారీ వర్షం కారణంగా ఓవర్లను కుదించే అవకాశం కూడా ఉంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ప్రస్తుతం బ్రిస్టల్‌ మైదానంలో చిరుజల్లులు కురుస్తుండటంతో పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. వర్షం తగ్గాక మ్యాచ్ మొదలైతే మొదటగా ఫీల్డింగ్ జట్టుకు అనుకూలంగా మారనుంది. ఇరు జట్లు తొలి మ్యాచ్‌లో ఓడినా.. రెండో మ్యాచ్‌లో విజయం సాధించాయి. అయితే శ్రీలంక కంటే పాకిస్తానే పటిష్టంగా ఉంది. గత మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌కు షాక్‌ ఇచ్చిన పాక్‌ రెండో విజయంపై కన్నేసింది. ఆఫ్ఘన్‌పై విజయంతో ఊపిరి పీల్చుకున్న శ్రీలంక కూడా విజయంపై దృష్టి పెట్టింది.

{headtohead_cricket_5_7}

ప్రపంచకప్‌లో లంకపై పాకిస్తాన్‌కు ఘనమైన రికార్డు ఉంది. ఇప్పటిదాకా ఏ ప్రపంచకప్‌లోనూ పాక్‌పై లంక గెలవలేదు. ఇరు జట్లు ఏడు మ్యాచ్‌లు ఆడగా.. లంక ఓటమినే మూటగట్టుకుంది. ఇపుడు చరిత్ర సృష్టించాలంటే లంక ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టాలి. పిచ్‌ బ్యాట్స్‌మెన్‌కు స్వర్గధామం. ఇక్కడ ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ 421 పరుగులు చేసింది. దీంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. అయితే భారీ వర్షం కారణంగా.. మొదటగా ఫీల్డింగ్ జట్టుకు అనుకూలంగా మారనుంది.

1
43654

Teams (Probable XI):

Sri Lanka:
Dimuth Karunaratne (c), Kusal Perera (wk), Lahiru Thirimanne/Avishka Fernando, Kusal Mendis, Angelo Mathews, Dhananjaya de Silva, Jeevan Mendis, Thisara Perera, Isuru Udana, Nuwan Pradeep, Lasith Malinga.

Pakistan:
Imam-ul-Haq, Fakhar Zaman, Babar Azam, Mohammad Hafeez, Sarfaraz Ahmed (c&wk), Shoaib Malik, Asif Ali, Shadab Khan, Wahab Riaz, Hasan Ali, Mohammad Amir.

Story first published: Friday, June 7, 2019, 15:12 [IST]
Other articles published on Jun 7, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X