న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాకిస్థాన్, శ్రీలంక పోరు.. బ్యాటింగ్‌పై లంక ఆందోళన

ICC Cricket World Cup 2019: Pakistan vs Sri Lanka: Pakistan More Balanced, Sri Lanka Arent The Side They Used to Be

ప్రపంచకప్‌లో భాగంగా బ్రిస్టల్‌ వేదికగా శుక్రవారం పాకిస్తాన్‌, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఇరు జట్లు తొలి మ్యాచ్‌లో ఓడినా.. రెండో మ్యాచ్‌లో విజయం సాధించాయి. అయితే శ్రీలంక కంటే పాకిస్తానే పటిష్టంగా ఉంది. గత మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌కు షాక్‌ ఇచ్చిన పాక్‌ రెండో విజయంపై కన్నేసింది. ఆఫ్ఘన్‌పై విజయంతో ఊపిరి పీల్చుకున్న శ్రీలంక పరువు కాపాడుకుంది.

ఫామ్‌లో పాక్:

ఫామ్‌లో పాక్:

వెస్టిండీస్‌తో జరిగిన మొదటి మ్యాచ్లో పాక్ బ్యాట్స్‌మన్‌ విఫలమయినా.. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌తో టాపార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ ఫామ్‌లోకి వచ్చారు. బాబర్‌ ఆజమ్, మహ్మద్ హఫీజ్, కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అర్ధ సెంచరీలతో ఊపు మీదున్నారు. ఫకర్ జామన్ ఎప్పుడైనా విరుచుకపడొచ్చు. ఇమామ్, మాలిక్, అలీ కూడా రాణిస్తే పాక్ భారీ స్కోర్ చేయొచ్చు. బౌలింగ్‌లో వాహబ్‌ రియాజ్, షాదాబ్‌ ఖాన్, ఆమిర్‌లు నిలకడగా వికెట్‌ తీస్తున్నారు. దీంతో శ్రీలంకకు కష్టాలు తప్పేలాలేవు.

బ్యాట్స్‌మెన్‌ తడబాటు:

బ్యాట్స్‌మెన్‌ తడబాటు:

ఫామ్‌లేమితో లంక బ్యాట్స్‌మెన్‌ తడబడుతున్నారు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో కెప్టెన్ దిముత్ కరుణరత్నె, ఆఫ్ఘన్‌ మ్యాచ్‌లో కుషాల్ పెరెరా మినహా ఎవరూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. తిరిమన్నే, మెండిస్, డిసిల్వా, పెరీరాలు రాణించాల్సిన అవసరం ఉంది. శ్రీలంక బౌలింగ్లో కూడా అంత భీకరంగా లేదు. లసిత్ మలింగ రాణిస్తే పాక్‌కు తిప్పలు తప్పవు. మలింగకు తోడు లక్మల్, ఉడానా, తిషారా పెరీరాలు ఉన్నారు.

పిచ్‌ బ్యాట్స్‌మెన్‌కు స్వర్గధామం:

పిచ్‌ బ్యాట్స్‌మెన్‌కు స్వర్గధామం:

ప్రపంచకప్‌లో లంకపై పాకిస్తాన్‌కు ఘనమైన రికార్డు ఉంది. ఇప్పటిదాకా ఏ ప్రపంచకప్‌లోనూ పాక్‌పై లంక గెలవలేదు. ఇరు జట్లు ఏడు మ్యాచ్‌లు అడ్డాగా.. లంక ఓటమినే మూటగట్టుకుంది. ఇపుడు చరిత్ర సృష్టించాలంటే లంక ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టాలి. పిచ్‌ బ్యాట్స్‌మెన్‌కు స్వర్గధామం. ఇక్కడ ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ 421 పరుగులు చేసింది. దీంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశం ఉంది.

Sri Lanka:

Sri Lanka:

Dimuth Karunaratne (c), Kusal Perera (wk), Lahiru Thirimanne/Avishka Fernando, Kusal Mendis, Angelo Mathews, Dhananjaya de Silva, Jeevan Mendis, Thisara Perera, Isuru Udana, Nuwan Pradeep, Lasith Malinga.

Pakistan:

Pakistan:

Imam-ul-Haq, Fakhar Zaman, Babar Azam, Mohammad Hafeez, Sarfaraz Ahmed (c&wk), Shoaib Malik, Asif Ali, Shadab Khan, Wahab Riaz, Hasan Ali, Mohammad Amir.

Story first published: Friday, June 7, 2019, 11:34 [IST]
Other articles published on Jun 7, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X