
హైదరాబాద్: బ్రిస్టల్ వేదికగా పాకిస్థాన్-శ్రీలంక జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ని వర్షం కారణంగా రద్దు చేస్తున్నట్లు అంఫైర్లు ప్రకటించారు. బ్రిస్టల్‌లో ఎడతెరిపి లేకుండా వాన పడుతుండడంతో మైదానం మొత్తం తడిసి ముద్దయింది. సుమారు 6 గంటల తర్వాత వర్షం నిలిచినప్పటికీ ఆట నిర్వహించేందుకు మైదానాన్ని గ్రౌండ్ సిబ్బంది సిద్ధం చేశారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఔట్‌ఫీల్డ్ చిత్తడిగా మారడంతో ఆటకు వీలుకాదని అంపైర్లు రద్దు చేశారు. వర్షం తెరపనివ్వకుండా కురుస్తుండడంతో మైదానం చిత్తడిగా మారింది. కనీసం టాస్ వేయకుండానే మ్యాచ్ ఆగిపోయింది. మైదానంలో వర్షం కురుస్తుండటంతో పిచ్ మొత్తం కవర్లతో కప్పి ఉంచారు. రెండు జట్ల కెప్టెన్లు, మేనేజ్‌మెంట్లతో చర్చించిన ఫీల్డ్ అంపైర్లు, మ్యాచ్ రిఫరీ ఈ నిర్ణయం తీసుకున్నారు.
వర్షం ఎంతకీ తగ్గకపోతే మ్యాచ్‌ని రద్దు చేసినట్లు అంఫైర్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. ఇదిలా ఉంటే, వరల్డ్ కప్‌లో శ్రీలంకపై పాకిస్థాన్ మెరుగైన రికార్డుని కలిగి ఉంది. ఇరు జట్లు ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లాడగా ఏడింట్లోనూ పాక్ విజయం సాధించింది.