Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇమామ్‌ ఉల్‌ హక్‌ ఔట్.. ఇమ్రాన్‌ తాహిర్‌ ఖాతాలో అరుదైన రికార్డు

ICC Cricket World Cup 2019, Pakistan vs South Africa: Imran Tahir becomes South Africa leading wicket-taker in World Cup


లార్డ్స్ మైదానం వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికా స్టార్ స్పిన్నర్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. పాకిస్థాన్ ఓపెనర్ ఇమామ్‌ ఉల్‌ హక్‌ (44)ను ఔట్ చేయడం ద్వారా ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా తాహీర్‌ (39) రికార్డుల్లోకి ఎక్కాడు. సౌతాఫ్రికా మాజీ పేసర్ అలన్ డోనాల్డ్ (38)ను తాహిర్‌ వెనక్కి నెట్టాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్‌కు ఓపెనర్లు ఇమామ్‌ ఉల్‌ హక్‌ (44), ఫకార్‌ జమాన్‌ (44)లు మంచి భాగస్వామ్యం అందించారు. ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచి నిలకడగా ఆడుతూ.. సఫారీ బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో ధాటిగా ఆడుతున్న జమాన్‌ స్కూప్‌ షాట్‌ ఆడి పెవిలియన్ చేరాడు. తాహిర్‌ బౌలింగ్‌లో జమాన్‌ స్కూప్‌ షాట్‌ ఆడగా బంతి వికెట్‌ కీపర్‌ వెనకాలే గాల్లోకి లేచింది. ఫస్ట్‌స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న హషీమ్‌ ఆమ్లా క్యాచ్‌ అందుకున్నాడు. దీంతో 81 పరుగుల బాగస్వామ్యంకు తెరపడింది.

21వ ఓవర్‌ రెండో బంతిని ఇమామ్‌ డ్రైవ్‌ చేయగా.. బంతి తాహిర్‌కు పక్కగా వెళ్తుండగా ఒంటి చేత్తో క్యాచ్‌ అందుకున్నాడు. దీంతో 98 పరగుల వద్ద పాక్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. తాహిర్‌ బౌలింగ్‌, ఫీల్డింగ్‌తో అదరగొట్టాడు. ఓపెనర్లిద్దరూ వెనుదిరగడంతో బాబర్‌ అజామ్‌, హఫీజ్‌ (20) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే పార్ట్‌టైమ్‌ స్పిన్నర్‌ మార్‌క్రమ్‌.. హఫీజ్‌ను ఔట్ చేసాడు. దీంతో పాక్ మూడో వికెట్‌ చేజార్చుకుంది. ప్రస్తుతం క్రీజులో సోహైల్‌ (12), బాబర్‌ (47)లు ఉన్నారు. పాక్ 34 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.

Story first published: Sunday, June 23, 2019, 17:47 [IST]
Other articles published on Jun 23, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+