Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఈ విజయంతో కొందరి నోళ్లు మూయించాం: పాక్‌ కోచ్‌

ICC Cricket World Cup 2019 : Hopefully We Can Just Shut Some People Up For A While : Mickey Arthur
ICC Cricket World Cup 2019, Pakistan vs South Africa: Hopefully we can just shut some people up for a while says Mickey Arthur

ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ విజయం సాధించడం ద్వారా కొంత మందితోనైనా నోర్లు మూయించామని పాకిస్థాన్‌ కోచ్‌ మిక్కీ ఆర్థర్‌ అన్నారు. ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌పై పరాజయం తర్వాత పాకిస్తాన్‌ జట్టు తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ముఖ్యంగా కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అటు కెప్టెన్సీలోనూ ఇటు ఆటలోనూ వైఫల్యం చెందడంతో సర్ఫరాజ్‌పై ఆ దేశ మాజీ క్రికెటర్లు, అభిమానులు విరుచుకుపడ్డారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

కొంతమంది నోర్లనైనా మూయించామనుకుంటున్నా:

కొంతమంది నోర్లనైనా మూయించామనుకుంటున్నా:

అయితే ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ 49 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంపై పాకిస్థాన్‌ కోచ్‌ మిక్కీ ఆర్థర్‌ స్పందించాడు. 'నాకు ఏదైతే తెలుసో అదే మా ఆటగాళ్లు చేస్తారు. పాక్ ఆటగాళ్లు తిరిగి గాడిలో పడడంతో మ్యాచ్ గెలిచాం. టీమిండియాతో ఓటమి కారుణంగా అనేక విమర్శలు వచ్చాయి. మీడియా, సోషల్‌ మీడియాతో పాటు అభిమానులు కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ఈ విజయంతో వారిలో కొంతమంది నోర్లనైనా మూయించామనుకుంటున్నా' అని ఆర్థర్‌ అన్నారు.

సెమీస్‌ చేరుతాం:

సెమీస్‌ చేరుతాం:

'న్యూజిలాండ్‌తో మ్యాచ్ కూడా గెలుస్తాం. సెమీస్‌ చేరేందుకు మిగతా మ్యాచ్‌లని సైతం గెలుస్తాం. న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌లను ఓడించి సెమీస్‌ చేరుతాం. పాక్ జట్టు బలంగా ఉంది. పాకిస్థాన్‌ బ్యాటింగ్‌, బౌలింగ్‌ బాగానే ఉంది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో క్యాచ్‌లు జారవిడవడంపై దృష్టిసారిస్తాం. తదుపరి మ్యాచ్‌ల్లో పొరపాట్లు చేయకుండా చూసుకుంటాం' అని ఆర్థర్‌ తెలిపారు.

సోహైల్‌ బ్యాటింగ్‌ అద్భుతం:

సోహైల్‌ బ్యాటింగ్‌ అద్భుతం:

'మధ్య ఓవర్లలో హారిస్‌ సోహైల్‌ కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. అతని బ్యాటింగ్‌ అద్భుతం. సరైన సమయంలో పరుగులు చేసాడు. మిగతా బ్యాట్స్‌మన్‌లతో మంచి భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఇపుడు అతను మా ప్రధాన బ్యాట్స్‌మన్‌. వచ్చే మ్యాచులలో కూడా సోహైల్‌ రాణించాలని కోరుకుంటున్నా' అని ఆర్థర్‌ అభిప్రాయపడ్డాడు.

Story first published: Monday, June 24, 2019, 13:47 [IST]
Other articles published on Jun 24, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+