
టోర్నీలో భాగంగా ఆదివారం పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 49 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఓటమితో దక్షిణాఫ్రికా ప్రపంచకప్‌లో సెమీస్ రేసు నుంచి తప్పుకుంది. దక్షిణాఫ్రికా తన తదుపరి మ్యాచ్‌లను శ్రీలంక, ఆస్ట్రేలియాలతో ఉన్నప్పటికీ వాటితో పెద్దగా ఉపయోగం లేదు. అవి గెలిస్తే పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలో దక్షిణాఫ్రికా నిలబడుతుంది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ప్రపంచప్‌లో ప్రతిసారీ దక్షిణాఫ్రికాకు అదృష్టం కలిసిరాదు. వర్షం కారణంగా కూడా సెమీస్ రేసు నుండి తప్పుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. సెమీస్ వరకు వచ్చే దక్షిణాఫ్రికా.. ఈ సారి మాత్రం లీగ్ స్టేజీలోనే ఇంటిదారి పట్టింది. మేటి బ్యాట్స్‌మన్, బౌలర్లు ఉన్నా దక్షిణాఫ్రికా కనీస పోటీ ఇవ్వకుండా ఓటములను చవిచూసింది. 300 పరుగులను కూడా ఛేదించలేక పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమిని చవిచూడడంతో ఆ జట్టుపై మాజీ క్రికెటర్లు, అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ మాట్లాడుతూ... 'దక్షిణాఫ్రికా జట్టుని ఇలా చూడటం చాలా బాధగా ఉంది. ఇంకా మ్యాచ్‌లు మిగిలి ఉన్నా టోర్నీ నుండి బయటికి రావడం దురదృష్టకరం' అని స్మిత్ పేర్కొన్నారు. 'ఈ ప్రపంచకప్ నుండి బయటకి రావడం దురదృష్టకరం. దక్షిణాఫ్రికా జట్టు చాలా ప్రశ్నలకు జవాబు చెప్పాల్సి ఉంటుంది' అని మాజీ బౌలర్ అలెన్ డొనాల్డ్ అన్నారు.
ఈ మ్యాచ్ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో డుప్లెసిస్ మాట్లాడుతూ... 'మా ఓటమిపై సరైన సమాధానం చెప్పలేకపోతున్నాను. మేం అసలు ఐపీఎల్ ఆడకుండా ఉండాల్సింది. కనీసం రబాడనైనా ఐపీఎల్‌లో ఆడకుండా అడ్డుకోని ఉండాల్సింది. అతను ఐపీఎల్ ఆడకుండా ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. కొంత మంది ఆటగాళ్లకు విశ్రాంతినిస్తే.. పని ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగేది. నూతన ఉత్సాహాంతో బరిలోకి దిగేవారు. విశ్రాంతి లేకుండా ఆడితే ఇలాంటి ఫలితాలే ఎదురవుతాయి. ఈ ప్రపంచకప్‌లో గాయాలు కూడా మా గెలుపుపై ప్రభావం చూపాయి' అని డుప్లెసిస్ అన్నాడు.