
ప్రపంచకప్‌లో భాగంగా లార్డ్స్ మైదానం వేదికగా మరికొద్ది సేపట్లో పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పాక్ ఎలాంటి మార్పులు చేయలేదు. మరోవైపు బంగ్లా రెండు మార్పులు చేసింది. మహ్మదుల్లా జట్టులోకి వచ్చాడు. ' టాస్ గెలవడం చాలా ముఖ్యం. మాకు వేరే ఆప్షన్ లేదు. ఇక భారీ స్కోర్ చేయాలి' అని సర్ఫరాజ్ అన్నాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఈ మ్యాచ్ పాక్ జట్టుకు చాలా కీలకం. కుడిచేతి బ్యాట్స్‌మన్‌కు లెగ్ సైడ్, పాయింట్ దిశగా మైదానం చిన్నదిగా ఉండడంతో బౌండరీల మోత మోగే అవకాశం ఉంది. సాంకేతికంగా సెమీ ఫైనల్ రేసులో నిలిచిన పాకిస్థాన్.. దాన్ని నిజం చేయాలంటే ఈ మ్యాచ్‌లో అనూహ్య విజయం సాధించాలి. విజయం అంటే మామూలు విజయం కాదు.. క్రికెట్ చరిత్రలోనే నిలిచిపోయేలా ఉండాలి. పాక్ మొదటగా బ్యాటింగ్ చేసి 312 పరుగుల తేడాతో విజయం సాధిస్తే సెమీ ఫైనల్ రేసులో ఉంటుంది. భారీ విజయం సాధ్యం కాకపోయినా.. పాక్ ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. మరోవైపు బంగ్లా ఇప్పటికే టోర్నీ నుండి నిష్క్రమించిన విషయం తెలిసిందే.
ప్రపంచకప్‌లో పాకిస్థాన్ ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడి.. నాలుగు గెలిచి, మూడు ఓడిపోయింది. మరొక మ్యాచ్ రద్దైంది. దీంతో 9 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఒకవేళ బంగ్లాపై గెలిచినా.. 11 పాయింట్లతో న్యూజిలాండ్‌తో సమానంగా ఉంటుంది. అయితే నెట్ రన్‌రేట్ ఇప్పటికే కివీస్‌కు +0.175 ఉండడం, పాకిస్థాన్‌కు -0.792గా ఉండడంతో పాక్ సెమీస్ చేరే అవకాశం చాలా తక్కువ.
న్యూజిలాండ్ రన్‌రేట్‌ను అధిగమించి పాకిస్థాన్ సెమీస్ చేరాలంటే సంచలనం సృష్టించాల్సిందే. పాకిస్తాన్ సెమీ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే.. మొదటగా పాక్ 350 పరుగులు చేసిన తర్వాత బంగ్లాదేశ్‌ను 312 పరుగుల తేడాతో ఓడించాలి. 400 పరుగులు చేసిన తర్వాత 316 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించాలి. ఇక 450 పరుగులు చేసిన తర్వాత బంగ్లాదేశ్‌ను 321 పరుగుల తేడాతో ఓడించాలి.
Teams:
Pakistan: Fakhar Zaman, Imam-ul-Haq, Babar Azam, Mohammad Hafeez, Haris Sohail, Sarfaraz Ahmed(w/c), Imad Wasim, Shadab Khan, Wahab Riaz, Mohammad Amir, Shaheen Afridi.
Bangladesh: Tamim Iqbal, Soumya Sarkar, Shakib Al Hasan, Mushfiqur Rahim(w), Mahmudullah, Liton Das, Mosaddek Hossain, Mohammad Saifuddin, Mehidy Hasan, Mashrafe Mortaza(c), Mustafizur Rahman.