ఓటములతో సతమతమవుతున్న దక్షిణాఫ్రికాకు మరో షాక్

ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా జట్టు ఇప్పటికే ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లలో ఓడి సతమతమవుతోంది. ఈ షాక్ నుండి తేరుకోకముందే సఫారీలకు మరో షాక్ తగిలింది. దక్షిణాఫ్రికా స్టార్ బౌలర్ లుంగి ఎంగిడి గాయం కారణంగా జూన్ 5న భారత్‌తో జరిగే మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఈ మేరకు దక్షిణాఫ్రికా జట్టు మేనేజర్ మహ్మద్ మూసాజీ స్పష్టం చేశాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఎంగిడికి గాయం
ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో లుంగి ఎంగిడికి తొడ కండరాలు పట్టేయడంతో వెంటనే మైదానాన్ని వీడాడు. చికిత్స అనంతరం కూడా మళ్లీ మైదానంలోకి రాలేదు. 'ఎంగిడి కోలుకోవడానికి 7-10 రోజుల సమయం పడుతుంది. ప్రస్తుతం అతనికి మెరుగైన వైద్యం అందిస్తున్నాం. భారత్‌తో మ్యాచ్‌లో ఎంగిడి ఆడడం లేదు. వెస్టిండీస్‌తో జరిగే మ్యాచ్‌కు ఎంగిడి అందుబాటులోకి వచ్చేలా చూస్తాం' అని మహ్మద్ మూసాజీ తెలిపాడు.

భారత్‌తో మ్యాచ్‌లో ఆమ్లా:
సౌతాఫ్రికా స్టార్ ఓపెనర్ హషీం ఆమ్లా గాయం నుంచి కోలుకుంటున్నాడట. దీంతో భారత్‌తో మ్యాచ్ వరకు ఆమ్లా పూర్తిగా ఫిట్ నెస్ సాధించి.. ఆ మ్యాచ్‌లో ఆడుతాడని సౌతాఫ్రికా మేనేజ్‌మెంట్ భావిస్తోంది. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో బంగ్లాతో ఆదివారం జరిగిన మ్యాచ్‌కు ఆమ్లా దూరమయ్యాడు. ప్రపంచకప్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ వేసిన బౌన్సర్ హెల్మెట్ గ్రిల్‌కు బలంగా తాకడంతో ఆమ్లా గాయపడ్డ విషయం తెలిసిందే.

స్టెయిన్ కూడా వస్తున్నాడు:
మరో ప్రధాన పేసర్ డేల్ స్టెయిన్ కూడా గాయపడిన విషయం తెలిసిందే. స్టెయిన్ ఐపీఎల్ 2019 జరుగుతుండగానే గాయపడ్డాడు. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కేవలం రెండు మ్యాచ్‌లాడి.. టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అప్పటి నుండి స్టెయిన్ కోలుకుంటున్నాడు. 80 శాతం మాత్రమే ఫిట్‌గా ఉండడంతో ఇంతవరకు స్టెయిన్ ప్రపంచకప్‌లో ఆడలేదు. భారత్‌తో మ్యాచ్‌కు స్టెయిన్ అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది.

దక్షిణాఫ్రికా ఓటమి:
ఆదివారం ఓవల్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 21 పరుగుల తేడాతో ఓడిపోయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. ముష్ఫికర్ రహీమ్ (80 బంతుల్లో 78; 8 ఫోర్లు), షకీబ్ అల్ హసన్ (84 బంతుల్లో 75; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో రాణించారు. అనంతరం దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 8 వికెట్లకు 309 పరుగులు చేసింది. కెప్టెన్ డుప్లెసిస్ (53 బంతుల్లో 62; 5 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ చేయగా.. జేపీ డుమిని (37 బంతుల్లో 45; 4 ఫోర్లు), మార్క్‌రమ్ (56 బంతుల్లో 45; 4 ఫోర్లు), వాన్ డర్ డసెన్ (38 బంతుల్లో 41; 2 ఫోర్లు, 1 సిక్స్) పోరాడారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications