వరల్డ్‌కప్ ప్రారంభ వేడుకలు: ఎప్పుడు, ఎక్కడ, ఏ ఛానల్‌లో తదితర వివరాలు!

హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న వన్డే వరల్డ్‌కప్‌కు మరికొన్ని గంటల్లో తెరలేవనుంది. టోర్నీలో భాగంగా ఆరంభ మ్యాచ్‌లో ఆతథ్య ఇంగ్లాండ్.. దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌కి లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానం వేదిక కానుంది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
కాగా, వరల్డ్‌కప్‌కు ముందు ఆరంభ వేడుకలను కూడా ఘనంగా నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. ఈ ప్రారంభ వేడుకలు బుధవారం రాత్రి 9.30 గంటలకు లండన్‌లోని మాల్ రోడ్‌లో జరగనున్నాయి. ఈ ప్రారంభ వేడుకలను అటు ఐసీసీతో పాటు వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమిస్తోన్న ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డులు సంయుక్తంగా నిర్వహించనున్నాయి.
ఈ వరల్డ్‌కప్ ప్రారంభ వేడుకల కార్యక్రమం సుమారు గంటసేపు జరగనుంది. క్రికెట్, సంగీతం కలబోతగా ఈ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా నాలుగు వేల మంది వీక్షించనున్నారు. వీరందరికి బ్యాలెట్ పద్ధతి ద్వారా ఎంపిక చేసి ఉచితంగా టికెట్లను అందజేశారు. ఈ వేడుకలను పలు చానెళ్లలో ప్రపంచ వ్యాప్తంగా ప్రసారం కానున్నాయి.
వరల్డ్‌కప్ ప్రారంభ వేడుకల గురించి తెలుసుకోండి:

వేదిక: ది మాల్, వెస్టమినిస్టర్‌లోని ఓ సిటీ, సెంట్రల్ లండన్
అతిథులు: రాజకుటుంబం నుంచి పెద్ద ఎత్తున అతిథులు వస్తున్నారు. డెలీ మెయిల్ కథనం ప్రకారం క్వీన్ ఎలిజిబెత్ II ముఖ్య అతిథి. ఆమెతో పాటు బకింగ్ హామ్ ప్యాలెస్‌కు చెందిన పలువురు అతిథులు. వరల్డ్‌కప్‌లో పాల్గొనే 10 జట్లకు చెందిన ఆటగాళ్లు ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదు. ఈ టోర్నీలో పాల్గొనే ప్రతి దేశం నుంచి ఓ క్రికెట్ లెజెండ్‌తో పాటు ఓ సెలబ్రిటీ స్టేజిపై ఉండనున్నారు. ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు నుంచి కెవిన్ పీటర్సన్‌తో పాటు క్రిస్ హ్యూస్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
ప్రదర్శనలు: డ్రమ్, బాస్ బ్యాండ్ రుడిమెంటర్ ప్రదర్శనలు ప్రత్యేకంగా ఆకట్టుకోనున్నాయి. "సెలబ్రేషన్ ఆఫ్ క్రికెట్, మ్యూజిక్, కల్చర్"లో భాగంగా ఇంగ్లాండ్ ఫేమస్ కమిడియన్ ప్యాడీ మెక్‌గునిస్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలవనున్నారు.
టైమింగ్: రాత్రి 9.30 గంటలకు
ఛానెల్: స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్
లైవ్ స్ట్రీమింగ్: హాట్‌స్టార్. కామ్

మొత్తం 46 రోజుల పాటు
మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా ఆరంభం కానున్న వన్డే వరల్డ్ కప్‌లో మొత్తం 46 రోజుల పాటు జరగనుంది. వన్డే వరల్డ్‌కప్‌కు ఇంగ్లాండ్ ఆతిథ్యమివ్వడం ఇది ఐదోసారి(1975, 1979, 1983, 1999). సరిగ్గా 20 ఏళ్ల తర్వాత మరోసారి వన్డే వరల్డ్‌కప్‌కు ఇంగ్లాండ్ వేదికగా మారింది. ప్రస్తుతం జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్ 12వ ఎడిషన్ కావడం విశేషం.

కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించేందుకు
ఈ 12వ ఎడిషన్ వరల్డ్‌కప్ ప్రారంభోత్సవాలను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించేందుకు ఐసీసీ భారీ ఏర్పాట్లు చేసింది. ఈ మెగా టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. యుకేలోని మొత్తం 11 వేదికల్లో 46 రోజుల పాటు మొత్తం 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. జులై 14న జరిగే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌కి ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యమివ్వనుంది.

భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నాం 2.30 గంటలకు
డే మ్యాచ్‌లు అన్ని కూడా భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నాం 2.30 గంటలకు ప్రారంభమవుతాయి. ఇక, డే/నైట్ మ్యాచ్‌లు మాత్రం భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమవుతాయి. 1975 నుంచి 1987 మధ్య జరిగిన నాలుగు వరల్డ్‌కప్‌ల్లో జట్లను గ్రూప్‌లుగా విభజించి మ్యాచ్‌లు నిర్వహించారు.

రౌండ్ రాబిన్ పద్ధతిలో
అయితే, మే30 నుంచి ఆరంభమయ్యే 12వ ఎడిషన్ వరల్డ్‌కప్‌ను మాత్రం రౌండ్ రాబిన్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. 1992 వరల్డ్‌కప్‌ను ఈ విధంగానే నిర్వహించారు. ఫలితంగా ప్రతి జట్టు 9 మ్యాచ్‌లు చొప్పున ఆడాల్సి ఉంటుంది. పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications