Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రపంచకప్‌.. గ్రాండ్‌హోమ్‌ వేసిన బంతికి అవాక్కయిన కోహ్లీ

ICC Cricket World Cup 2019: Off stump uprooted, Virat Kohli stunned by a de Grandhomme in-swinger

టీమిండియా కెప్టెన్, పరుగుల మెషిన్ విరాట్ కోహ్లీ క్రీజులోకి వచ్చాడంటే పరుగుల వరద పారాల్సిందే. అది చేజింగ్ చేయడంలో అయినా, టార్గెట్ విధించడంలో అయినా విరాట్ బ్యాటింగ్ ఒకే విధంగా ఉంటుంది. బౌలర్ ఎవరు అయినా పట్టించుకోకుండా తన మార్క్ షాట్లతో బౌండరీలు బాదుతాడు. బంతి ఎటువచ్చినా వదలడు. అటువంటి కోహ్లీ కూడా తాజాగా ఓ బంతికి అవాక్కయ్యాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వార్మప్‌ మ్యాచ్‌లో టీమిండియ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. కివీస్ స్టార్ బౌలర్ ట్రెంట్‌ బౌల్ట్‌ తన తొలి స్పెల్‌లోనే మూడు వికెట్లు తీసాడు. ఈ దశలో విరాట్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసాడు. అయితే కివీస్ ఆల్‌రౌండర్‌ కొలిన్‌ డి గ్రాండ్‌హోమ్‌ వేసిన 11 ఓవర్ మూడో బంతికి కోహ్లీ బౌల్డ్ అయ్యాడు. బంతి మరీ ఇన్‌స్వింగ్‌ అయి వికెట్లను గిరాటేయడంతో కోహ్లీ సైతం అవాక్కయ్యాడు. అనంతరం నిరాశగా పెవిలియన్ చేరాడు.

కోహ్లీ అనంతరం హార్దిక్‌ పాండ్య, ఎంఎస్ ధోనీ, దినేష్ కార్తీక్ త్వరగానే పెవీలియన్ చేరారు. అయితే కుల్‌దీప్‌ యాదవ్‌ (19 )సహాయంతో రవీంద్ర జడేజా (54) అర్ధ శతకం చేసి పోరాడటంతో భారత్‌ 179 పరుగులకు ఆలౌటైంది. లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్ ఆరంభంలో తడబడింది. రెండో ఓవర్‌ వేసిన బుమ్రా ఓ చక్కని బంతికి కొలిన్‌ మన్రో (4)ను పెవిలియన్‌ చేర్చాడు. అయితే సీనియర్ ప్లేయర్ రాస్‌టేలర్‌ (70), కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌ (67) బాధ్యతాయుతంగా ఆడి జట్టుని విజయం దిశగా తీసుకెళ్లారు. చివరలో నికోల్స్ (15) న్యూజిలాండ్‌కు విజయాన్ని అందించాడు.

Story first published: Sunday, May 26, 2019, 18:19 [IST]
Other articles published on May 26, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+