Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'ప్రపంచకప్‌.. నం.4లో కేఎల్‌ రాహుల్‌నే ఆడించాలి'

ICC Cricket World Cup 2019: Not Vijay Shankar, Harbhajan Singh wants KL Rahul to be Indias no.4

ప్రపంచకప్‌.. నాలుగో స్థానంలో కేఎల్ రాహుల్‌నే ఆడించాలి, అతనే ఆ స్థానానికి న్యాయం చేయగలడు అని టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్‌ సింగ్‌ అన్నారు. మే 30 నుండి ప్రపంచకప్‌ జరగనుంది. ఇందుకోసం గత నెలలోనే 15 మందితో కూడిన టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. అయితే నం.4లో అంబటి రాయుడుని కాదని విజయ్‌శంకర్‌ను ఎంపిక చేసింది. మరోవైపు ఆ స్థానం కోసం స్పెసలిస్ట్ బ్యాట్స్‌మన్‌ రాహుల్ కూడా పోటీలో ఉన్నాడు. దీంతో ఈ స్థానంలో ఎవరు బ్యాటింగ్‌ చేస్తారన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

నం.4లో రాహుల్‌నే ఆడించాలి:

నం.4లో రాహుల్‌నే ఆడించాలి:

ఈ నేపథ్యంలో టీమిండియా మాజీలు నాలుగో స్థానంపై తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో హర్భజన్‌ సింగ్‌ కూడా తన అభిప్రాయాన్ని తెలిపాడు. 'నం.4లో కేఎల్‌ రాహుల్‌ తప్ప నాకు మరెవరూ కనపడట్లేదు. ఐపీఎల్‌లో మంచి ప్రదర్శన చేసాడు. నాలుగో స్థానంలో కేఎల్ రాహుల్‌నే ఆడించాలి. అతనే ఆ స్థానానికి న్యాయం చేయగలడు' అని హర్భజన్‌ పేర్కొన్నారు.

వారికి స్వేచ్ఛనివ్వాలి:

వారికి స్వేచ్ఛనివ్వాలి:

'ప్రపంచకప్‌లో ఎంఎస్ ధోనీకి వీలైనంత స్వేచ్ఛ ఇవ్వాలి. అది సూచనల విషయంలో అయినా.. బ్యాటింగ్‌ విషయంలోనైనా. ధోనీని ఇదే స్థానంలో పంపాలి అని నియమాలేవీ పెట్టవద్దు. ధోనీతో పాటు హార్దిక్‌ పాండ్యకు కూడా స్వేచ్ఛనివ్వాలి. ఈ ఇద్దరికీ స్వేచ్ఛ ఇస్తే.. బాగా రాణించగలరు. ఇందుకు ఐపీఎల్‌ మంచి ఉదాహరణ. ఇద్దరు బ్యాటింగ్ లో ముందుకు వచ్చి పరుగులు చేశారు' అని భజ్జి గుర్తు చేశారు.

ధోనీ విధ్వంసాన్ని చూడాలనుకుంటున్నా:

ధోనీ విధ్వంసాన్ని చూడాలనుకుంటున్నా:

'ధోనీ, పాండ్యల నుంచి ఎక్కువ సిక్స్‌లు ఆశిస్తున్నా. ముఖ్యంగా బౌలర్లపై ధోనీ విధ్వంసాన్ని చూడాలనుకుంటున్నా. బ్యాటింగ్‌ శైలి విషయంలో జట్టు మేనేజ్‌మెంట్‌ ఇద్దరికీ లైసెన్సులు ఇవ్వాలి. ఎలాంటి షరతులు పెట్టకూడదు. వారికి ఏ స్థానంలో బ్యాటింగ్‌ చేయాలని ఉంటే అక్కడే ఆడనివ్వాలి' అని హర్భజన్‌ సూచించారు.

Story first published: Saturday, May 18, 2019, 15:38 [IST]
Other articles published on May 18, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+