For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బౌలింగ్‌ వేస్తానంటే జోకా అన్నారు.. నా బౌలింగ్‌ మీద నమ్మకం ఉంది: కోహ్లీ

ICC Cricket World Cup 2019 : Virat Kohli Says 'No one believes in my bowling but I do'
ICC Cricket World Cup 2019: No one believes in my bowling but I do says Virat Kohli

నేను బౌలింగ్‌ వేస్తానంటే జోకా అన్నారు. తన బౌలింగ్‌పై జట్టులో ఎవరికీ నమ్మకం లేకపోయినా.. తనకు ఉందని టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ తెలిపాడు. బ్యాటింగ్‌లో పరుగుల వరద పారించే కోహ్లీ.. బౌలింగ్‌ కూడా చేయగలడు. అయితే కోహ్లీ బౌలింగ్ చేయడం చాలా అరుదు. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సారథ్యంలో కోహ్లీ బౌలింగ్ చేసాడు. తాను కెప్టెన్ అయ్యాక మాత్రం బంతిని పట్టలేదు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

అయితే తాను ఎక్కువగా బౌలింగ్‌ చేయకపోవడానికి కారణం జట్టు సభ్యులేనని కోహ్లీ అంటున్నాడు. తాజాగా కోహ్లీ మాట్లాడుతూ... '2017లో శ్రీలంకలో వన్డే సిరీస్‌ జరుగుతోంది. ఆ మ్యాచ్‌లో టీమిండియా దాదాపుగా విజయాన్ని ఖరారు చేసుకుంది. అప్పుడు బౌలింగ్‌ చేస్తానని కెప్టెన్ ధోనీని అడగగా.. అతడు సరేనన్నాడు. ఇక చేతులు తిప్పుతూ బంతి వేయడానికి సిద్ధమవుతున్నా. బౌండరీ లైన్‌ వద్ద ఉన్న బుమ్రా అది చూసి.. "జోక్‌ చేయకు. ఇది అంతర్జాతీయ మ్యాచ్‌" అని పెద్దగా అరిచాడు' అని కోహ్లీ తెలిపాడు.

'జట్టులో ఎవరికీ నా బౌలింగ్‌ మీద నమ్మకం లేదు, కానీ నాకుంది. ఆ తర్వాత వెన్నునొప్పి కారణంగా మళ్లీ బౌలింగ్‌ చేయలేదు. డిల్లీలోని అకాడమీలో అండర్సన్‌ బౌలింగ్‌ శైలిని గమనిస్తూ ఉండేవాడిని. ఆ తర్వాత అండర్సన్‌కు ఆ విషయం చెప్పా' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. తాజాగా కోహ్లీ నెట్స్‌లో బౌలింగ్ చేస్తూ కనిపించాడు. వన్డే, టీ20 ఫార్మాట్‌లో కలిపి విరాట్‌ 8 వికెట్లు తీసాడు. టెస్టుల్లో బౌలింగ్ వేసినా.. వికెట్‌ దక్కలేదు.

Story first published: Monday, June 3, 2019, 10:47 [IST]
Other articles published on Jun 3, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+