
టీమిండియా ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ గాయంపై బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. శంకర్‌కు అయిన గాయం చిన్నదే అని తెలిపింది. దీంతో టీమిండియాకు ఊరట లభించింది. న్యూజిలాండ్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ నేపథ్యంలో నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా శంకర్ కుడిచేతికి దెబ్బతగిలింది. దీంతో ప్రాక్టీస్ సెషన్ మధ్యలోనే అతడు వెనుదిరిగాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం
వెంటనే అతన్ని హాస్పిటల్‌కు తీసుకెళ్లి.. స్కానింగ్ తీయించారు. చేతికి ఫ్రాక్చర్ కాలేదని వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని టీమిండియా మేనేజ్‌మెంట్ శనివారం ట్విట్టర్ వేదికగా తెలిపింది. శంకర్ త్వరగా కోలుకునేందుకు బీసీసీఐ మెడికల్ టీమ్ అతనికి చికిత్స అందిస్తోంది. గాయం కారణంగా శనివారం న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వామప్ మ్యాచ్‌లో శంకర్ ఆడలేదు.
28న బంగ్లాదేశ్‌తో రెండో సన్నాహక మ్యాచ్‌ను కూడా విజయ్ శంకర్ ఆడకపోవచ్చు. ప్రపంచకప్ అసలు సమరం జూన్ 5న దక్షిణాప్రికాతో ప్రారంభమవనుంది. ఇంకా వారం సమయం ఉండడంతో.. అప్పటివరకు శంకర్ కోలుకుంటాడు. అయితే తొలి వామప్ మ్యాచ్‌లో నాలుగో స్థానంలో కేఎల్ రాహుల్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో రాహుల్.. 10 బంతులు ఎదుర్కొని 6 పరుగులు మాత్రమే చేసాడు. దినేష్ కార్తీక్ కూడా బ్యాటింగ్ చేసాడు. కేదార్ జాదవ్ మాత్రం బరిలోకి దిగలేదు.