Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

న్యూజిలాండ్‌తో వార్మప్ మ్యాచ్: No. 4 స్థానంపై సస్పెన్షన్ వీడుతుందా?

In Cricket World Cup No. 4 wait is over India face New Zealand in warm-up.

హైదరాబాద్: ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్‌కు సర్వం సిద్ధమైంది. మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టోర్నీలో భాగంగా శుక్రవారం నుంచి వార్మప్ మ్యాచ్‌లు కూడా ప్రారంభమయ్యాయి. వార్మప్ మ్యాచ్ షెడ్యూల్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య శనివారం వార్మప్ మ్యాచ్ జరగనుంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

No.4 స్థానంపై తీవ్ర చర్చ

No.4 స్థానంపై తీవ్ర చర్చ

వరల్డ్‌కప్‌కు ముందు వరకు భారత జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌లో No.4 స్థానంపై తీవ్ర చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీ కోసం 15 మందితో కూడిన జట్టుని సెలక్టర్లు ఎంపిక చేసినప్పుడు విజయ్ శంకర్ ఈ స్థానానికి చక్కగా సరిపోతాడని చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ఎమ్మెస్కే ప్రసాద్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

వీడనున్న సస్పెన్షన్

ఈ నేపథ్యంలో శనివారం జరగనున్న ఇండియా, న్యూజిలాండ్ వార్మప్ మ్యాచ్‌లో ఈ No.4 స్థానంపై నెలకొన్న సస్పెన్ష్ వీడనుంది. కేఎల్ రాహుల్, విజయ్ శంకర్, కేదర్ జాదవ్‌తోపాటు మిగతా క్రికెటర్లలో ఎవరో ఒకరు ఈ నాలుగు స్థానంలోకి తీసుకునే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ కోసం కోహ్లీసేన అప్పుడే ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టింది.

మొత్తం 10 జట్లు

మొత్తం 10 జట్లు

టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. యుకేలోని మొత్తం 11 వేదికల్లో 46 రోజుల పాటు మొత్తం 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. టోర్నీలో భాగంగా కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా జూన్‌ 5న సౌతంప్టన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో తన తొలి మ్యాచ్‌ ఆడనుంది. వరల్డ్‌కప్‌కు ఇంగ్లాండ్ ఆతిథ్యమివ్వడం ఇది ఐదోసారి.

వరల్డ్‌కప్‌లో భారత జట్టు

విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, విజయ్ శంకర్, ధోని(వికెట్ కీపర్), కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ

Story first published: Friday, May 24, 2019, 19:33 [IST]
Other articles published on May 24, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+