Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రపంచకప్‌.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

ICC Cricket World Cup 2019, New Zealand vs Sri Lanka: New Zealand have won the toss and have opted to field

కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్ వేదికగా శ్రీలంక, న్యూజిలాండ్ జట్ల మధ్య మరికొద్ది సేపట్లో మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బ్లండెల్‌ తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. కివీస్ జట్టు ఒక స్పిన్నర్, ఇద్దరు ఆల్‌రౌండర్‌లను తీసుకుంది. లంక సీనియర్ బౌలర్లు నువాన్ ప్రదీప్, సౌథీలకు చోటు దక్కలేదు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

కివీస్ టాపార్డర్‌, మిడిల్ ఆర్డర్‌ బ్యాటింగ్ చాలా పటిష్టంగా ఉంది. దీంతో వీరిని పెవియన్ చేర్చడం లంక బౌలర్లకు పెను సవాలే. మరోవైపు కివీస్ బౌలింగ్‌లో బాగానే ఉంది. అయితే లంక జట్టు మాత్రం రెండు విభాగాల్లో మోస్తరుగా ఉంది. దీంతో కివీస్ జట్టే ఫెవరెట్ గా బరిలోకి దిగుతోంది.

1
43646

ప్రపంచకప్‌లో కివీస్‌, లంక 10 మ్యాచ్‌లు ఆడితే న్యూజిలాండ్‌ 4 గెలిస్తే.. లంక 6 గెలిచింది. గత రికార్డు లంకకు అనుకూలంగా ఉన్నా.. ప్రస్తుతం ఆ జట్టు విజయం సాధించే పరిస్థితిలో లేదు. అయితే లంకకు పుంజుకునే శక్తి ఉంది. తనదైన రోజున చెలరేగే ఆటగాళ్లు ఉండడం సానుకూలాంశం.

{headtohead_cricket_4_7}

జట్లు:
శ్రీలంక:

దిముత్ కరుణరత్నె (కెప్టెన్), తిరిమన్నె, కుషల్ పెరెరా, కుషల్ మెండిస్, మాథ్యూస్, ధనంజయ డిసిల్వా, తిసార పెరెరా, జీవన్ మెండిస్, లక్మల్, ఇసురు ఉడాన, మలింగ.

న్యూజిలాండ్:
గుప్తిల్, మున్రో, విలియమ్సన్ (కెప్టెన్), టేలర్, లాథమ్, నీషమ్, గ్రాండ్‌హోమ్, శాంట్నర్, ఫెర్గూసన్, హెన్రీ, బౌల్ట్.

Story first published: Saturday, June 1, 2019, 15:25 [IST]
Other articles published on Jun 1, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+