న్యూజిలాండ్‌తో శ్రీలంక ఫైట్.. లంక నిలవగలదా?

కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్ వేదికగా నేడు న్యూజిలాండ్‌తో శ్రీలంక తలపడనుంది. ప్రస్తుతం న్యూజిలాండ్ జోరు మీదుంది. వార్మప్ మ్యాచ్‌లో బలమైన భారత్‌ను చిత్తుగా ఓడించింది. గత ప్రపంచకప్‌లో ఫైనల్ చేరిన కివీస్.. ఈసారి కూడా బలమైన జట్టుతో బరిలో దిగింది. మరోవైపు ఇటీవల వన్డేల్లో పెద్దగా రాణించని శ్రీలంక.. ఓ విజయం కోసం తహతహలాడుతోంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ జోరుముందు లంక నిలువగలదా?.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

బ్యాటింగే బలం:
ప్రతి జట్టుకు టాపార్డర్ బ్యాటింగే బలం. అయితే కివీస్‌కు మాత్రం అలా కాదు. టాపార్డర్ విఫలమయినా.. రాస్ టేలర్, కెప్టెన్ విలియమ్సన్‌లు ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక లాథమ్, నికోల్స్, నీషమ్, గ్రాండ్‌హోమ్ చెలరేగితే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలే. శాంట్నర్, ఫెర్గూసన్, బౌల్ట్, సౌథీలతో బౌలింగ్ కూడా పటిష్టంగానే ఉంది.

ఒక్క బ్యాట్స్‌మన్ ఫామ్‌లో లేడు:
మరోవైపు లంక పరిస్థితి దారుణంగా ఉంది. ఒక్క బ్యాట్స్‌మన్ కూడా ఫామ్‌లో లేడు. అయితే కుశాల్ పెరీరా, ఏంజెలో మాథ్యూస్, తిసార పెరీరాలు మోస్తరుగా ఆడుతున్నారు. దిముత్ కరుణరత్నె, తిరిమన్నె, కుషల్ మెండిస్లు రాణించాల్సిన అవసరం ఉంది. ఉడాన, మలింగ, లక్మల్ బౌలింగ్ విభాగంలో రాణిస్తుండడం లంకకు ఊరటనిచ్చే అంశం. అయితే లంక కచ్చితంగా గెలుస్తుందని చెప్పలేని స్థితిలో ఉంది. ఏవైనా సంచనాలు నమోదయితేనే లంక విజయం సాధిస్తుంది.

గత రికార్డు బాగున్నా:
శ్రీలంక, న్యూజిలాండ్ జట్లు ఇప్పటివరకు 98 వన్డేలు ఆడాయి. అందులో కివీస్ 48 గెలిస్తే.. లంక 41 నెగ్గింది. ఒక మ్యాచ్ టై కాగా.. 8 మ్యాచ్‌లు రద్దయ్యాయి. ఇక ప్రపంచకప్‌లో కివీస్, లంక 10 మ్యాచ్‌లు ఆడితే న్యూజిలాండ్ 4 గెలిస్తే.. లంక 6 గెలిచింది. గత రికార్డు లంకకు అనుకూలంగా ఉన్నా.. ప్రస్తుతం ఆ జట్టు విజయం సాధించే పరిస్థితిలో లేదు.

తుది జట్లు (అంచనా)
శ్రీలంక:
దిముత్ కరుణరత్నె (కెప్టెన్), తిరిమన్నె, కుషల్ మెండిస్, కుషల్ పెరెరా, మాథ్యూస్, ధనంజయ డిసిల్వా, తిసార పెరెరా, జీవన్ మెండిస్, ఇసురు ఉడాన, మలింగ, లక్మల్.
న్యూజిలాండ్:
గప్టిల్, నికోల్స్/మున్రో, విలియమ్సన్ (కెప్టెన్), టేలర్, లాథమ్/బ్లండెల్, నీషమ్, గ్రాండ్‌హోమ్, శాంట్నర్, ఫెర్గూసన్, బౌల్ట్, సౌథీ.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications