
క్రికెట్‌లో ఆటలో బ్యాట్స్‌మన్‌లు హిట్ వికెట్ అవ్వడం సాధారణ విషయం. షాట్ ఆడే క్రమంలో బ్యాట్స్‌మన్ అదుపు తప్పి వికెట్లను తాకుతారు. ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో కూడా ఇదే జరిగింది. న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ హిట్ వికెట్‌గా ఔట్ అయి వార్తల్లో నిలిచాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ సాఫీగా సాగుతోంది. ఓపెనర్ కొలిన్ మున్రో (12) ఔట్ అయినా.. గప్టిల్, విలియమ్సన్‌లు ఇన్నింగ్స్ నిర్మించారు. ఈ క్రమంలో ప్రొటీస్ బౌలర్ ఫెహ్లుక్వాయో వేసిన 15 ఓవర్ చివరి బంతికి గప్టిల్ లెగ్ సైడ్ దిశగా పుల్‌షాట్ ఆడి.. అదుపు తప్పి కాలితో వికెట్లను తాకాడు. వెంటనే బెయిల్స్ పడిపోవడంతో గప్టిల్ హిట్ వికెట్‌గా ఔటయ్యాడు. షాట్ ఆడిన అనంతరం గప్టిల్ బ్యాలెన్స్ తప్పి 360 డిగ్రీలో ఒక రౌండ్ తిరిగాడు. ఔట్ అయిన అనంతరం గప్టిల్ నవ్వుకుంటూ వెళ్లడం కొసమెరుపు.
ఈ మ్యాచ్‌లో గప్టిల్ 35 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. ప్రపంచకప్‌లో ఇంతవరకు ఏ కివీస్ బ్యాట్స్‌మన్ వికెట్‌గా ఔటవ్వలేదు. తొలి బ్యాట్స్‌మన్ గప్టిలే. దీనికి సంబంధించిన వీడియో క్రికెట్ వరల్డ్‌కప్ తన అధికారిక ట్వీటర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
ఈ ప్రపంచకప్‌లో ఇది రెండో హిట్ వికెట్. పాకిస్థాన్ సీనియర్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డేలో హిట్ వికెట్‌గా ఔటయ్యాడు. ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ వేసిన 47 ఓవర్ నాలుగో బంతికి బ్యాక్ ఫుట్ తీసుకుని.. బంతిని కొట్టబోయి స్టంప్స్‌ను కొట్టాడు. దీంతో షోయబ్ హిట్ వికెట్ ఔట్ అయ్యాడు. షోయబ్ ఆడిన షాట్ చూసి మైదానంలోని ఆటగాళ్లు సైతం ఆశ్చర్యపోయారు.