న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

న్యూజిలాండ్‌తో దక్షిణాఫ్రికా పోరు.. సఫారీలకు సవాల్‌

ICC Cricket World Cup 2019 : New Zealand vs South Africa Match Preview || Oneindia Telugu
ICC Cricket World Cup 2019, New Zealand vs South Africa Match Prediction, Playing XI: Lungi Ngidi Back for South Africa, Nichols & Southee Fit For Black Caps

ప్రపంచకప్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. బుధవారం బర్మింగ్‌హామ్‌ వేదికగా న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న న్యూజిలాండ్‌ మరో విజయంపై కన్నేయగా.. మూడు ఓటముల తర్వాత ఆప్ఘనిస్థాన్‌పై గెలిచిన దక్షిణాఫ్రికా కూడా మరో విజయంను సాధించాలనే పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్‌ ఓడితే దక్షిణాఫ్రికా సెమీస్‌ ఆశలు పూర్తిగా గల్లంతవడం ఖాయం.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

పేస్ బలం:

పేస్ బలం:

కివీస్‌ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించింది. ఇక వర్షం కారణంగా భారత్‌తో మ్యాచ్‌ రద్దయింది. శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ లాంటి చిన్న జట్లపై విజయం సాధించిన కివీస్‌కు ఇక నుంచి అసలు సమరం మొదలుకానుంది. అయితే కివీస్ పటిష్టంగానే ఉంది. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌, రాస్‌ టేలర్‌, కొలిన్‌ మన్రో, మార్టిన్‌ గప్టిల్‌లతో బ్యాటింగ్‌ దుర్భేద్యంగా ఉంది. వారితో పాటు మిడిలార్డర్‌లో లాథమ్, నీషమ్ రెచ్చిపోతే తిరుగుండదు. మ్యాట్ హెన్రీ, ట్రెంట్ బౌల్ట్, జిమ్మీ నీషమ్‌, లుకీ ఫెర్గూసన్‌, గ్రాండ్‌హోమ్‌తో బౌలింగ్‌ కూడా బాగానే ఉంది. కివీస్ పేసర్లు అద్భుతంగా రాణించి ప్రత్యర్థి జట్లను తక్కువ స్కోర్లకే కట్టడి చేస్తున్నారు. వీరిని అడ్డుకోవడం సఫారీలకు కష్టమే.

ఎంగిడి ఎంట్రీ:

ఎంగిడి ఎంట్రీ:

ఇక సెమీస్ చేరాలంటే దక్షిణాఫ్రికాకు ప్రతీ మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితి. సీనియర్ బ్యాట్స్‌మెన్ ఆమ్లా, డికాక్‌ భారీ ఓపెనింగ్ బాకీ ఉన్నారు. కెప్టెన్ డుప్లెసిస్ రాణిస్తున్నా.. భారీ ఇనింగ్స్ ఆడట్లేదు. డేవిడ్‌ మిల్లర్‌, మార్‌క్రమ్‌, డుమినిలు గాడిలో పడాలి. బౌలింగ్ కూడా సఫారీలకు కలిసి రావట్లేదు. గాయంతో దూరమైన ఎంగిడి తిరిగి జట్టులో చేరడం కాస్త ఊరటనిచ్చే అంశం. వెటరన్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్‌ కివీస్ జట్టును ఎలా కట్టడి చేస్తాడో చూడాలి. క్రిస్‌ మోరిస్‌, ఫెలుక్వాయోలు బౌలింగ్‌ భారం మోయనున్నారు.

ప్రపంచకప్‌లో కివీస్‌దే పైచేయి:

ప్రపంచకప్‌లో కివీస్‌దే పైచేయి:

దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ జట్లు ఇప్పటివరకు 70 వన్డేలు ఆడాయి. 41 మ్యాచ్‌ల్లో సఫారీలు గెలిస్తే.. 24 మ్యాచ్‌ల్లో కివీస్‌ నెగ్గింది. ఐదింట్లో ఫలితం తేలలేదు. ఇక ప్రపంచకప్‌లో కివీస్‌, దక్షిణాఫ్రికాలు 7 సార్లు తలపడ్డాయి. కివీస్‌ ఐదు మ్యాచ్‌ల్లో గెలవగా.. సఫారీలు రెండింట్లో విజయం సాధించారు.

Teams (Probably XI):

Teams (Probably XI):

New Zealand:

Kane Williamson (capt), Trent Boult, Colin de Grandhomme, Lockie Ferguson, Martin Guptill, Tom Latham (wk), Jimmy Neesham, Henry Nicholls, Mitchell Santner, Tim Southee and Ross Taylor

South Africa

South Africa

Faf du Plessis (c), Quinton de Kock (wk), Aiden Markram, Hashim Amla, Rassie van der Dussen, David Miller, Chris Morris, Andile Phehlukwayo, Kagiso Rabada, Lungi Ngidi and Imran Tahir

Story first published: Wednesday, June 19, 2019, 10:02 [IST]
Other articles published on Jun 19, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X