Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కివీస్‌పై పాక్‌ విజయం సాధిస్తుంది.. మళ్లీ ఆ ఫీట్‌ పునరావృతం అవుతుంది

ICC Cricket World Cup 2019, New Zealand vs Pakistan: Wasim Akram hopes Pakistan can repeat 1992 performance vs New Zealand


న్యూజిలాండ్‌పై పాకిస్తాన్‌ విజయం సాదిస్తుందని పాక్ మాజీ పేస్ బౌలర్ వసీం అక్రమ్‌ ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచకప్‌లో భాగంగా బర్మింగ్‌హామ్‌ వేదికగా బుధవారం న్యూజిలాండ్‌ను పాకిస్తాన్‌ ఢీ కొననుంది. వరుస విజయాలతో దూసుకపోతున్న కివీస్‌ను ఓడించడం పాక్‌కు సవాల్‌తో కూడుకున్నదే. అయితే గత మ్యాచ్‌లో పటిష్ఠ దక్షిణాఫ్రికాపై గెలిచిన ఆత్మవిశ్వాసంతో పాక్‌ బరిలోకి దిగుతోంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఆ ఫీట్‌ పునరావృతం అవుతుంది:

ఆ ఫీట్‌ పునరావృతం అవుతుంది:

ఈ నేపథ్యంలో వసీం అక్రమ్‌ మీడియాతో మాట్లాడుతూ... '1992 ప్రపంచకప్‌లో వరుస విజయాలు సాదిస్తున్న న్యూజిలాండ్‌ను 7 వికెట్ల తేడాతో పాక్‌ ఓడించింది. ఇప్పుడు కూడా కివీస్‌పై పాక్‌ విజయం సాధిస్తుంది. మళ్లీ ఆ ఫీట్‌ పునరావృతం అవుతుంది' అని అక్రమ్‌ ధీమా వ్యక్తం చేశారు. న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో ఎటువంటి మార్పుల్లేకుండా విన్నింగ్‌ జట్టునే ఆడించాలని కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌కు సూచించాడు.

ఫీల్డింగ్‌లో మెరుగవ్వాలి:

ఫీల్డింగ్‌లో మెరుగవ్వాలి:

'పాక్‌ జట్టు అన్ని విభాగాల్లో ఇంకా మెరుగవ్వాల్సి ఉంది. ముఖ్యంగా ఫీల్డింగ్‌లో. టోర్నీలో ఇప్పటివరకు 14 క్యాచ్‌లను నేలపాలు చేశారు. అత్యధిక క్యాచ్‌లను జారవిడిచిన జట్లలో పాక్‌ తొలి స్థానంలో నిలవడం బాధగా ఉంది. క్యాచ్‌లే మ్యాచ్‌లను నిలబెడుతాయన్న విషయాన్నీ గుర్తుంచుకోవాలి. పాక్‌ టాపార్డర్‌ రాణిస్తున్నన్నా.. మిడిలార్డర్‌, లోయర్‌ ఆర్డర్‌ వైపల్యంతో ఓడిపోతున్నాం. వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ బాబర్‌ అజమ్‌ భారీ ఇన్నింగ్స్‌లు ఆడలేకపోతున్నాడు. అతను ఇంకా మెరుగైన ప్రదర్శన చేయాల్సింది' అని అక్రమ్‌ చెప్పుకొచ్చారు.

కోహ్లీలా ఆడడం నేర్చుకో:

కోహ్లీలా ఆడడం నేర్చుకో:

'బాబర్‌ నువ్వు విరాట్‌ను ఆరాథ్య ఆటగాడిగా బావిస్తున్నావ్. కోహ్లీని ఆరాధించడమే కాదు అతడిలా బ్యాటింగ్‌ చేయడం నేర్చుకోవాలి. జట్టు క్లిష్టమైన పరిస్థితుల్లో కోహ్లీ ఎన్నో పరుగులు చేశాడు. భారీ ఇన్నింగ్స్‌లు ఆడాడు. సింగిల్స్‌ ఎలా చేయాలో విరాట్‌ నుంచి నేర్చుకో. కోహ్లీలా పరిపూర్ణ ఆటగాడిలా ఎదగాలి. ఒకసారి రోహిత్, విలియంసన్, కోహ్లీలను గమనిస్తే.. హాఫ్ సెంచరీ అనంతరం వేగం పెంచుతారు. వారి నుండి అది నేర్చుకోవాలి. ఎక్కువ షాట్లు ఆడాలి' అని అక్తర్‌ యూట్యూబ్‌ చానల్‌ ద్వారా సలహా ఇచ్చాడు.

తప్పక గెలవాల్సిందే:

తప్పక గెలవాల్సిందే:

భారత్‌తో మ్యాచ్‌లో ఓటమి అనంతరం పాకిస్థాన్‌ తిరిగి పుంజుకుంది. దక్షిణాఫ్రికాను చిత్తుచేసి ప్రపంచకప్‌ సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకున్నది. పాక్ ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో రెండు మాత్రమే గెలిచింది. మూడింట్లో ఓడిపోగా.. ఓ మ్యాచ్‌ రద్దైంది. దీంతో ఐదు పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతోంది. ఇక న్యూజిలాండ్‌, అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌లతో ఆడాల్సిన మ్యాచ్‌ల్లో పాక్ తప్పక గెలవాల్సి ఉంటుంది. అన్నీ గెలిస్తే మొత్తం 11 పాయింట్లతో నాకౌట్‌ చేరే అవకాశం ఉంది. అయితే అదే సమయంలో ఇతర జట్ల గెలుపోటములపై ఆధారపడాల్సి ఉంది.

Story first published: Wednesday, June 26, 2019, 11:14 [IST]
Other articles published on Jun 26, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+