Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

న్యూజిలాండ్-పాకిస్థాన్ మ్యాచ్‌.. గంట ఆలస్యంగా టాస్

ICC Cricket World Cup 2019, New Zealand vs Pakistan: Toss delayed due to wet outfield

ప్రపంచకప్‌లో భాగంగా బర్మింగ్‌హామ్‌ వేదికగా ఇప్పటికే న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌ జట్లు తలపడాలి కానీ.. ఇంకా టాస్ కూడా పడలేదు. వర్షం కారణంగా ప్రస్తుతం ఔట్‌ ఫీల్డ్‌ తడిగా ఉండడంతో టాస్‌ ఆలస్యంగా వేయనున్నారు. మూడు గంటల తర్వాత అంపైర్లు పిచ్‌ను పరిశీలించి నిర్ణయం తీసుకున్నారు. మ్యాచ్ గంట ఆలస్యంగా ప్రారంభం కానుంది. టాస్ మాత్రం మరో 30 నిమిషాల్లో వేయనున్నారు. ఇరు జట్ల కెప్టెన్లు కూడా పిచ్‌ను పరిశీలించారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

అపజయమే లేకుండా దూసుకెళ్తున్న న్యూజిలాండ్‌ సెమీఫైనల్స్‌ బెర్తుకు ఒక్క గెలుపు దూరంలో ఉంది. ఈ మ్యాచ్ ఓడినా.. న్యూజిలాండ్‌కు ఇంకా రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. మరోవైపు పాక్ పరిస్థితి అలా లేదు. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో రెండింటిలో గెలిచిన పాక్‌ మూడు ఓడింది. వర్షం కారణంగా ఒక మ్యాచ్‌ రద్దయింది. దీంతో పాక్ 5 పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతోంది. సెమీస్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే మిగతా మూడు మ్యాచ్‌ల్లో తప్పక గెలవాల్సిందే. ఈ నేపథ్యంలో కివీస్ మ్యాచ్ గెలవాల్సిందే. ఒకవేళ వర్షం పది రద్దయినా సెమీస్ ఆశలు గల్లంతే.

ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 106 మ్యాచ్‌లు జరగ్గా.. 54 మ్యాచ్‌ల్లో పాకిస్తాన్‌, కివీస్‌ 48 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఒకటి టై కాగా.. మూడింట్లో ఫలితం తేలలేదు. ప్రపంచకప్‌లోనూ న్యూజి లాండ్‌పై పాకిస్తాన్‌దే పైచేయిగా ఉంది. మొత్తం 8 మ్యాచ్‌లాడగా.. ఆరింట్లో పాక్, రెండింట్లో కివీస్‌ గెలుపొందాయి.

1
43676

{headtohead_cricket_4_5}

Story first published: Wednesday, June 26, 2019, 15:19 [IST]
Other articles published on Jun 26, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+