
ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఘన విజయాన్ని సాధించింది. భారత్ చేతిలో పరాజయం తర్వాత పాక్ వరుసగా రెండో విజయం సాధించి సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. మొన్నటి వరకు పాక్ అన్నివిభాగాల్లో తేలిపోయింది. ముఖ్యంగా ఫీల్డింగ్‌లో. టోర్నీలో ఇప్పటివరకు 14 క్యాచ్‌లను నేలపాలు చేశారు. అత్యధిక క్యాచ్‌లను జారవిడిచిన జట్లలో పాక్ తొలి స్థానంలో ఉంది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం క్యాచ్‌లను అద్భుతంగా అందుకున్నారు. పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ రెండు అద్భుతమైన క్యాచ్‌లు అందుకున్నాడు. స్టార్ బౌలర్ షహీన్ బౌలింగ్‌లో కివీస్ బ్యాట్స్‌మన్ టేలర్ ఇచ్చిన క్యాచ్‌ను సర్ఫరాజ్ కుడివైపు డైవ్ చేసి మరీ అందుకున్నాడు. ఇది మ్యాచ్‌కే హైలెట్. సర్ఫరాజ్ సూపర్ క్యాచ్‌కి పాక్ ఫాన్స్ ఫిదా అయ్యారు. దీంతోపాటు మరో రెండు క్యాచ్‌లను కూడా సర్ఫరాజ్ పట్టాడు.
టీమిండియపై ఓటమి, ఆవలింత తీయడంతో సర్ఫరాజ్ పై ఆ దేశ అభిమానులు విరుచుకుపడ్డారు. దక్షిణాఫ్రికాపై విజయం సాధించడంతో కొంత శాంతించిన అభిమానులు.. న్యూజిలాండ్‌పై విజయంతో పూర్తిగా శాంతించారు. రెండు క్యాచ్‌లతో ఆకట్టుకున్న కెప్టెన్‌పై ప్రశంశల వర్షం కురిపిసున్నారు. మరికొందరు ప్రస్తుత క్యాచ్ ఫొటో, ఆవలింత ఫొటో జతచేసి మీమ్స్ సెట్ చేస్తున్నారు.
భారత్‌తో మ్యాచ్‌లో ఓటమి అనంతరం పాకిస్థాన్ తిరిగి పుంజుకుంది. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ను చిత్తుచేసి ప్రపంచకప్ సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకున్నది. పాక్ ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో మూడు మాత్రమే గెలిచింది. మూడింట్లో ఓడిపోగా.. ఓ మ్యాచ్ రద్దైంది. దీంతో ఏడు పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఇక అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్‌లతో ఆడాల్సిన మ్యాచ్‌ల్లో పాక్ తప్పక గెలవాల్సి ఉంటుంది. అన్నీ గెలిస్తే మొత్తం 11 పాయింట్లతో నాకౌట్ చేరే అవకాశం ఉంది. అయితే అదే సమయంలో ఇతర జట్ల గెలుపోటములపై ఆధారపడాల్సి ఉంది.