For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రపంచకప్‌.. సరికొత్త రికార్డు నెలకొల్పిన టామ్‌ లాథమ్‌

ICC Cricket World Cup 2019, New Zealand vs England: Tom Latham equals wicketkeeping record with three catches in World Cup 2019 Final Match

ఈ ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ వికెట్‌ కీపర్‌ టామ్‌ లాథమ్‌ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఒక ప్రపంచకప్‌లో అత్యధిక ఔట్లలో భాగస్వామ్యమైన వికెట్‌ కీపర్‌గా లాథమ్‌ రికార్డుల్లోకి ఎక్కాడు. ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం లార్డ్స్‌ మైదానంలో ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్ పోరులో లాథమ్‌ మూడు క్యాచ్‌లను అందుకున్నాడు. దీంతో ఒకే ప్రపంచకప్‌లో అత్యధిక మందిని ఔట్ చేసిన కీపర్‌గా ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ (ఆస్ట్రేలియా) సరసన చేరాడు. 2003 ప్రపంచకప్‌లో గిల్‌క్రిస్ట్‌ 21 ఔట్లలో భాగస్వామ్యం అయితే తాజాగా లాథమ్‌ ఆ రికార్డును సమం చేసాడు.

ఈ జాబితాలో గిల్‌క్రిస్ట్‌ మొదటి స్థానంలో ఉండగా.. లాథమ్‌ రెండో స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా కీపర్ అలెక్స్‌ క్యారీ (20, 2019 ప్రపంచకప్‌), శ్రీలంక కీపర్ కుమార సంగక్కర (17, 2003 ప్రపంచకప్‌)లు తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఫైనల్ మ్యాచ్‌లో జేసన్‌ రాయ్‌, జో రూట్‌, క్రిస్‌ వోక్స్‌ క్యాచ్‌లను లాథమ్‌ అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ గెలిచిన విషయం తెలిసిందే.

క్రికెట్‌ పుట్టినిల్లు ఇంగ్లాండ్‌ తొలిసారిగా ప్రపంచకప్‌ను సాధించింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. నీకోల్స్ (55), లాతమ్ (47) రాణించారు. లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్‌ కూడా 50 ఓవర్లలో 241 పరుగులకే ఆలౌటైంది. స్టోక్స్‌ (84నాటౌట్‌; 98బంతుల్లో 5×4, 2×6) అద్భుత పోరాటం చేశాడు. మ్యాచ్‌ టై కావడంతో సూపర్‌ ఓవర్‌కు దారితీసింది.

సూపర్‌ ఓవర్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ 6 బంతుల్లో 15 పరుగులు చేసింది. బట్లర్, స్టోక్స్ చెరో బౌండరీ బాదారు. ఛేదనకు దిగిన న్యూజిలాండ్‌ కూడా 6 బంతుల్లో 15 పరుగులు చేసింది. నీశమ్ ఒక సిక్స్ బాదాడు. సూపర్‌ ఓవర్‌ కూడా టైగా ముగియడంతో.. ఐసీసీ నిబంధనల ప్రకారం మ్యాచ్‌లో ఎక్కువ బౌండరీలు సాధించిన జట్టు విజేతగా నిలుస్తుంది. ఇంగ్లండ్‌ అత్యధిక బౌండరీలు సాధించడంతో కప్ గెలిచింది.

Story first published: Monday, July 15, 2019, 15:43 [IST]
Other articles published on Jul 15, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+