పిల్లలూ క్రీడల్లోకి రావొద్దు.. వేరే ప్రొఫెషన్ ఎంచుకోండి

ఇంగ్లాండ్ ఎన్నో ఏళ్ల కల నేరవేరింది. క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లాండ్ తొలిసారిగా ప్రపంచకప్‌ను సాధించింది. ఆదివారం లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ఐసీ వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో విజయం ఇరు జట్ల మధ్య దోబూచులాడినా చివరకు ఇంగ్లాండ్ నే వరించింది. నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి ఇరు జట్లూ సమాన స్కోర్ సాధించడంతో మ్యాచ్ టైగా అయింది. తర్వాత సూపర్ ఓవర్‌లోనూ సమాన స్కోర్లు సాధించడంతో.. మ్యాచ్ మొత్తంలో ఎక్కువ బౌండరీలు ( ఫోర్లు, సిక్సర్లు) బాదిన ఇంగ్లాండ్ జట్టు తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఇదే అతిపెద్ద విజయం:
ఇదో అద్భుతమైన మ్యాచ్. ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. ఈ విజయం నమ్మశక్యంగా లేదు. నా జీవితంలో ఇదే అతిపెద్ద విజయం అని ఇంగ్లాండ్ ఆటగాళ్లు అంటుంటే.. గెలుపు అంచునకు వచ్చిన న్యూజిలాండ్ జట్టు ఆటగాళ్ల ఆవేదన మాత్రం వర్ణనాతీతంగా ఉంది. మ్యాచ్ అనంతరం ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ మీడియాతో మాట్లాడుతూ ఏకంగా ఏడ్చేశాడు. ఇక కెప్టెన్ కేన్ విలియమ్సన్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు.

క్రీడల్లోకి రావొద్దు:
ఈ క్రమంలో న్యూజిలాండ్ ఆటగాడు జేమ్స్ నీషమ్ ట్వీటర్‌లో ఓ పోస్ట్ పెట్టి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. 'పిల్లలూ ఎవ్వరూ క్రీడల్లోకి రావొద్దు. మీరు వేరే ఎదైనా ప్రొఫెషన్ ఎంచుకోండి. 60 ఏళ్లకే హ్యాపీగా చనిపోండి' అంటూ జిమ్మీ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నీషమ్ పెట్టిన ఈ పోస్టుకు నెటిజన్ల తమదైన స్టయిల్లో కామెంట్లు కురిపిస్తున్నారు. న్యూజిలాండ్ అభిమానులే కాదు.. భారత క్రికెట్ అభిమానులు కూడా నీషమ్‌ను ఓదార్చుతున్నారు.

అభిమానులు మ్యాచ్‌కు వచ్చేలా చేయండి:
ఫైనల్ మ్యాచ్ ముందురోజు కూడా నీషమ్ ఓ పోస్ట్ చేసాడు. 'ప్రియమైన భారత అభిమానులారా. ఒకవేళ ఫైనల్ మ్యాచ్‌ను వీరు వీక్షించేందుకు స్టేడియానికి రాలేకపోతే.. దయచేసి మీ వద్ద ఉన్న మ్యాచ్ టికెట్లను అధికారిక ప్లాట్‌ఫామ్‌ల ద్వారా విక్రయించండి. అధిక లాభానికి అమ్ముకోవాలని అందరికీ అనిపిస్తుంది. కానీ.. ధనవంతులే కాకుండా నిజమైన క్రికెట్ అభిమానులు మ్యాచ్‌కు వచ్చేలా చేయండి' అని తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చాడు.
{headtohead_cricket_2_4}
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications