For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అనూహ్యంగా చోటు.. అంచనాల్ని అందుకున్న జోఫ్రా ఆర్చర్‌

ICC Cricket World Cup 2019, New Zealand vs England: Jofra Archer becomes leading wicket-taker for England

ఇంగ్లండ్‌ ప్రపంచకప్‌ జట్టులో అనూహ్యంగా చోటుదక్కించుకున్న స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌.. అంచనాలను అందుకుని సత్తా చాటాడు. ప్రపంచకప్‌కు సెలెక్ట్ చేసిన ఇంగ్లండ్‌ యాజమాన్య, కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టాడు. ఈ క్రమంలోనే ఆర్చర్‌ అరుదైన రికార్డును సాధించాడు. ఒకే ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ తరఫున అత్యధిక వికెట్లు (20) తీసిన ఆటగాడిగా రికార్డులోకి ఎక్కాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో మ్యాట్‌ హెన్రీని ఔట్‌ చేసి ఈ ఘనత సాధించాడు.

 అతనే టాపర్:

అతనే టాపర్:

18 వికెట్లతో మార్క్‌ వుడ్‌ రెండో స్థానంలో ఉండగా.. క్రిస్ వోక్స్‌ 16 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ముగ్గురూ ప్రస్తుత ప్రపంచకప్‌లోనే అత్యధిక వికెట్లు సాధించారు. 1992 ప్రపంచకప్‌లో 16 వికెట్లు తీసిన ఇయాన్ బోథమ్‌ నాలుగో స్థానంలో ఉన్నాడు. 2007 ప్రపంచకప్‌లో ఆండ్రూ ఫ్లింటాఫ్‌ 14 వికెట్లు తీసి ఐదో స్థానంలో ఉన్నాడు. ఎన్నో ఏళ్లుగా జట్టులో ఉన్న ఇంగ్లండ్ టాప్ బౌలర్లు జేమ్స్ ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ ప్రపంచకప్‌లో మాత్రం తమ ప్రభావం చూపలేకపోయారు.

 అనూహ్యంగా చోటు:

అనూహ్యంగా చోటు:

ఇంగ్లిష్‌ కౌంటీల్లో సత్తాచాటడంతో జోఫ్రా ఆర్చర్‌ పేరు తెరపైకి వచ్చింది. ఇంగ్లండ్‌ ముందుగా ప్రకటించిన ప్రపంచకప్‌ జట్టులో ఆర్చర్‌ పేరు లేదు. లెఫ్టార్మ్‌ పేసర్‌ డేవిడ్‌ విల్లే గాయపడితే అనూహ్యంగా ఆర్చర్‌కు చోటు దక్కింది. ఇక ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన తొలి మ్యాచ్‌లో ఏకంగా ఆరు వికెట్లు సాధించాడు. దీంతో మరింత పాపులర్ అయ్యాడు. ఐపీఎల్‌లో అదరగొట్టడంతో ప్రపంచకప్‌కు ముందు జరిగిన పాక్ సిరీస్‌కు ఎంపికయి అక్కడ సత్తా చాటి ప్రపంచకప్‌లో ప్రధాన బౌలర్ అయ్యాడు.

మ్యాచ్‌ టై:

మ్యాచ్‌ టై:

ఇంగ్లాండ్‌ తొలిసారిగా ప్రపంచకప్‌ను సాధించింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. నీకోల్స్ (55), లాతమ్ (47) రాణించారు. ఇంగ్లాండ్‌ బౌలర్లు వోక్స్, ప్లంకెట్‌ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్‌ కూడా 50 ఓవర్లలో 241 పరుగులకే ఆలౌటైంది. స్టోక్స్‌ (84నాటౌట్‌; 98బంతుల్లో 5×4, 2×6) అద్భుత పోరాటం చేశాడు. మ్యాచ్‌ టై కావడంతో సూపర్‌ ఓవర్‌కు దారితీసింది.

 సూపర్‌ ఓవర్‌ కూడా టై:

సూపర్‌ ఓవర్‌ కూడా టై:

సూపర్‌ ఓవర్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ 6 బంతుల్లో 15 పరుగులు చేసింది. బట్లర్, స్టోక్స్ చెరో బౌండరీ బాదారు. ఛేదనకు దిగిన న్యూజిలాండ్‌ కూడా 6 బంతుల్లో 15 పరుగులు చేసింది. నీశమ్ ఒక సిక్స్ బాదాడు. సూపర్‌ ఓవర్‌ కూడా టైగా ముగియడంతో.. ఐసీసీ నిబంధనల ప్రకారం మ్యాచ్‌లో ఎక్కువ బౌండరీలు సాధించిన జట్టు విజేతగా నిలుస్తుంది. ఇంగ్లండ్‌ అత్యధిక బౌండరీలు సాధించడంతో కప్ గెలిచింది.

Story first published: Monday, July 15, 2019, 16:55 [IST]
Other articles published on Jul 15, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+