Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇంగ్లండ్ అభిమానులకు పండగే.. ఒకే రోజు మూడు ఫైనల్‌ మ్యాచ్‌లు

ICC Cricket World Cup 2019 Final : England V New Zealand: England Fans Ready For Long Night !
ICC Cricket World Cup 2019, New Zealand vs England Final: England Fans Ready for Long Night on Sunday for 3 Final Matchs


27 ఏళ్ల తర్వాత సొంత గడ్డపై ఇంగ్లండ్‌ ప్రపంచకప్‌ ఫైనల్‌ చేరడంతో ఆ దేశ అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగే ఫైనల్ మ్యాచ్ కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. దీనికి తోడు మరో రెండు ఫైనల్‌ మ్యాచ్‌లు కూడా ఆదివారమే జరగనున్నాయి. క్రికెట్ ప్రపంచకప్‌ ఫైనల్‌, వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌తో పాటు బ్రిటిష్‌ గ్రాండ్‌ ప్రీ ఫార్ములా రేసింగ్‌ ఉంది. మూడు మ్యాచ్‌లు ఉండడంతో అభిమానులు ఏ మ్యాచ్ చూడాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌:

వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌:

సెమీ ఫైనల్‌లో పటిష్ట ఆస్ట్రేలియాను ఓడించిన ఆతిథ్య ఇంగ్లండ్‌.. ఆదివారం లార్డ్స్ మైదానంలో న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఇప్పటివరకు ప్రపంచకప్‌ గెలవని ఇంగ్లండ్ ఈసారి ఎలాగైనా సాధించాలనే పట్టుదలతో ఉంది. ప్రస్తుతం ఇంగ్లండ్ ఫామ్ చూస్తే కప్ కప్ సునాయాసంగా కొట్టగలదు. మరోవైపు కివీస్‌ కూడా తొలిసారి ప్రపంచకప్‌ను అందుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య జరిగే ఫైనల్‌ రసవత్తరంగా సాగనుంది.

జకోవిచ్‌ vs ఫెడరర్‌:

జకోవిచ్‌ vs ఫెడరర్‌:

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ నోవాక్‌ జకోవిచ్‌, స్విస్ దిగ్గజం రోజర్ ఫెడరర్‌ వింబుల్డన్‌-2019 ఫైనల్‌కు చేరుకున్నారు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి సెమీఫైనల్లో జొకోవిచ్‌ 6-2, 4-6, 6-3, 6-2తో 23వ సీడ్‌ బాటిస్టా అగుట్‌ (స్పెయిన్‌)పై విజయం సాధించాడు. ఫెదరర్‌ 7-6 (7/3), 1-6, 6-3, 6-4తో మూడో సీడ్‌ రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌)పై గెలిచాడు. ఈ ఫైనల్ మ్యాచ్ కూడా ఆదివారమే జరగనుంది. ఇద్దరు టాస్ స్టార్ల మధ్య పోరు ఆసక్తికరంగా జరగనుంది. ఇక వింబుల్డన్‌ మహిళల సింగిల్స్‌ టైటిల్‌ కోసం సెరెనా విలియమ్స్‌, సిమోనా హలెప్‌ శనివారం తలపడనున్నారు.

బరిలో లూయిస్‌ హామిల్టన్‌:

బరిలో లూయిస్‌ హామిల్టన్‌:

ఆదివారం బ్రిటిష్‌ గ్రాండ్‌ ప్రీ ఫైనల్స్‌ కూడా జరగనుంది. సిల్వర్‌స్టోన్‌ సర్క్యూట్‌ (ట్రాక్‌) వేదికగా జరగబోయే ఈ పోటీలో బ్రిటిష్ డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ బరిలో ఉన్నాడు. ఇప్పటికే ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన హామిల్టన్‌.. మెర్సిడీస్‌ డ్రైవర్‌ వాల్టేరీ బొట్టాస్‌తో కలిసి అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక ఆదివారం జరిగే ఫైనల్స్‌లో హామిల్టన్‌ గెలిచి జిమ్ క్లార్క్‌, అలైన్ ప్రోస్ట్‌ను పేరిట ఉన్న గత రికార్డును అధిగమించాలని చూస్తున్నాడు.

Story first published: Saturday, July 13, 2019, 15:09 [IST]
Other articles published on Jul 13, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+