ధోనీ రిటైర్మెంట్ కోరుకునేవారు ఈ వీడియో చూడాల్సిందే!!

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వికెట్ల వెనుక ఎంత సమయస్ఫూర్తితో వ్యవహరిస్తుంటాడో అందరికీ తెలిసిందే. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ కదలికలకు అనుగుణంగా బౌలర్ల మార్పు, ఫీల్డింగ్ కూర్పులు చేస్తూ ఫలితం రాబడుతాడు. ఇక కీలక సమయంలో అవసరానికి తగ్గట్లు బౌలర్లకు విలువైన సూచనలు ఇస్తుంటాడు. డీఆర్‌ఎస్‌లోనైతే ధోనీకి తిరుగేలేదు. డీఆర్ఎస్ అంటే డెసిషన్ రివ్యూ సిస్టం. కానీ, అభిమానులు దాన్ని ధోనీ రివ్యూ సిస్టంగా మార్చేశారు. మరి అంతలా ధోనీ తన ప్రభావంను చూపించాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా తడబడుతున్న సమయంలో తన విలువైన సూచనలు ఇస్తాడు. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ బ్యాట్ జుళిపిస్తున్న సమయంలో బౌలర్లకు కీలక సూచనలు ఇస్తుంటాడు. అతడిచ్చే సూచనలు చాలా వరకు సఫలం అయ్యాయని బౌలర్లు కూడా చాలా సందర్భాల్లో తెలిపారు. ఈ ప్రపంచకప్‌లో కూడా ధోనీ బౌలర్లకు సూచనలు ఇచ్చాడు.
2004లో తొలిసారి భారత జట్టులోకి వచ్చిన ధోనీ.. తన బ్యాటింగ్, చురుకైన కీపింగ్, విజయవంతమైన నాయకత్వంతో జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. అయితే ధోనీ ఆటతీరుపై ఇప్పుడు విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రపంచ క్రికెట్‌లో గొప్ప మ్యాచ్ ఫినిషర్లలో ఒకడిగా పేరున్న ధోనీ ఈ ప్రపంచకప్‌లో మెల్లగా ఆడుతున్నాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో భారత్ ఓటమి అనంతరం ఈ తరహా విమర్శలు ఎక్కువయ్యాయి. ఇక ధోనీ రిటైర్మెంట్ ఇవ్వాలని అంటున్నారు. ధోనీ రిటైర్మెంట్ కోరుకునేవారు ఈ వీడియో చూస్తే అతనెంత విలువైన ఆటగాడో తెలుస్తుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications