సచిన్ సూచన.. ఐదో స్థానంలో ధోనీ బ్యాటింగ్‌కు రావాలి

ప్రపంచకప్-2019లో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు రావాలని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సూచించారు. ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుండి ప్రపంచకప్ సమరం ప్రారంభం కానుంది. టీమిండియా జట్టులో ఎప్పటినుండో నాలుగో స్థానంపై చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. మరో వారం రోజుల్లో మెగా టోర్నీ ప్రారంభం కానున్నా.. ఈ స్థానంలో ఎవరు ఆడుతారో మాత్రం తెలియట్లేదు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

ఐదో స్థానంలో ధోనీ రావాలి:
అయితే సచిన్ నాలుగో స్థానంపై స్పందించకుండా.. బ్యాటింగ్ ఆర్డర్‌లో ధోనీని ముందుకు పంపాలని తన అభిప్రాయం తెలిపారు. తాజాగా సచిన్ ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... 'ధోనీ ఐదో స్థానంలో బ్యాటింగ్ చేస్తే మంచిదని నేను అనుకుంటున్నా. జట్టు కూర్పు ఏమిటో ఇప్పటికీ నాక్కూడా తెలియదు. ఓపనర్లుగా శిఖర్ ధావన్, రోహిత్ శర్మలు.. మూడో స్థానంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ వస్తాడు. నాలుగో స్థానంలో ఎవరువచ్చినా.. ఐదో స్థానంలో ధోనీ రావాలి' అని సచిన్ పేర్కొన్నారు.

లెఫ్ట్-రైట్ కాంబినేషన్ ఉండాలి:
'అనంతరం హార్దిక్ పాండ్యా మిడిల్ ఆర్డర్‌కు అండగా ఉంటాడు. ఈ సమయంలో అనుభవం ఉన్న ధోనీ.. పాండ్యాతో కలిసి మ్యాచును ముందుకు తీసుకెళ్లగలడు. జట్టులో లెఫ్ట్-రైట్ (ధావన్) కాంబినేషన్ ఉపయోగపడుతుంది. బౌలర్ ఒక్కోసారి లయ తప్పుతాడు. ప్రతిసారి బౌలర్, కెప్టెన్ ఆలోచించేలా చేస్తోంది. ఈ కాంబినేషన్ బాగస్వామ్యం జట్టుకు విలువైన పరుగులు అందిస్తుంది. ముఖ్యంగా లెగ్ స్పిన్నర్లపై లెఫ్ట్ హ్యాండర్ ఒత్తిడి పెంచే అవకాశం ఉంది' అని సచిన్ తెలిపారు.

భారత్ సెమీస్ చేరుకుంటుంది:
ప్రపంచకప్‌లో కచ్చితంగా భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు సెమీస్ చేరుకుంటాయి. నాలుగో స్థానంలో న్యూజీలాండ్, పాకిస్థాన్ జట్లు పోటీలో ఉన్నాయి. టీమిండియాకు మంచి జట్టు ఉంది. కెప్టెన్ విరాట్ కోహ్లీపై అతిగా ఆధారపడొద్దు. సమిష్టి కృషితో ముందుకు సాగాలి. కప్ సాధించే అవకాశాలు టీమిండియాకే ఎక్కువగా ఉన్నాయి' అని సచిన్ చెప్పుకొచ్చారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications