For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రాజకీయాల్లోకి ధోనీ.. బీజేపీ పార్టీలోకేనా?

MS Dhoni May Join BJP Post Retirement Says Former Union Minister Sanjay Paswan || Oneindia Telugu
ICC Cricket World Cup 2019: MS Dhoni may join BJP post retirement says former Union Minister Sanjay Paswan

భారత మాజీ కెప్టెన్, వికెట్‌కీపర్‌ మహేంద్రసింగ్‌ ధోనీ రిటైర్మెంట్‌ అనంతరం బీజేపీ పార్టీలో చేరుతాడని కేంద్ర మాజీమంత్రి, ఆ పార్టీ సీనియర్‌ నేత సంజయ్‌ పాస్వాన్‌ తెలిపారు. ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సెమీఫైనల్లో టీమిండియా చివరివరకు పోరాడి 18 పరుగుల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. దీంతో ప్రపంచకప్‌లో భారత్‌ కథ సెమీస్‌తో ముగిసింది.

రిటైర్మెంట్‌పై ఒత్తిడి:

రిటైర్మెంట్‌పై ఒత్తిడి:

సెమీఫైనల్లో ధోనీ (50; 72 బంతుల్లో 1x4, 1x6) చివరకు వరకు పోరాడాడు. అయితే కీలక సమయంలో ధోనీ రనౌట్ ఔట్ అవ్వడంతో మ్యాచ్ చేజారింది. ఈ ప్రపంచకప్‌లో భారత జట్టును ధోనీ చాలా సార్లే ఆదుకున్నాడు. అయితే స్ట్రైక్ రేట్ విషయంలో మాత్రం తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా ఇంగ్లండ్ మ్యాచుతో ధోనీ ధాటిగా బ్యాటింగ్ చేయకపోవడంతో రిటైర్మెంట్‌పై ఒత్తిడి పెరిగింది. ప్రపంచకప్‌ అనంతరం ధోనీ రిటైర్మెంట్‌ ఇస్తాడని అందరూ ఊహిచారు. కానీ అలా జరగలేదు.

కమలం కండువా కప్పుకోనున్న ధోనీ:

కమలం కండువా కప్పుకోనున్న ధోనీ:

కొంచెం లేట్ అయినా ధోనీ రిటైర్మెంట్‌ ప్రకటిస్తాడు. రిటైర్మెంట్‌ అంతరం ధోనీ ఏం చేస్తాడు అని అందరిలో ఓ ప్రశ్న. అయితే రిటైర్మెంట్‌ అనంతరం మహీ బీజేపీ పార్టీలో చేరుతాడని కేంద్ర మాజీమంత్రి సంజయ్‌ పాస్వాన్‌ తెలిపారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... 'ధోనీ నాకు చాలా కాలంగా తెలుసు. అతను నాకు మంచి స్నేహితుడు. అతనొక ప్రపంచ ఆటగాడు. అతన్ని బీజేపీలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ విషయంపై చర్చలు జరుపుతున్నారు. ధోనీ రిటైర్మెంట్‌ అనంతరమే దీనిపై నిర్ణయం తీసుకోవచ్చు' అని పాస్వాన్‌ అన్నారు.

రిటైర్ అయ్యాక పాలటిక్స్‌లోకి:

రిటైర్ అయ్యాక పాలటిక్స్‌లోకి:

ఇంతకుముందు చాలామంది క్రికెటర్లు రిటైర్ అయ్యాక వెంటనే పాలటిక్స్‌లోకి ఎంటర్ అవుతున్నారు. ఇలా క్రికెట్ నుంచి రాజకీయాల వైపు అడుగులు వేసిన వారిలో మనోజ్ ప్రభాకర్, కీర్తి ఆజాద్, శ్రీశాంత్, అజరుద్దీన్, తాజాగా ఎంపీ గౌతం గంభీర్ ఉన్నారు. ఈ కోవాలోకే జార్ఖండ్ డైనమైట్ కూడా చేరనున్నారు. అన్నీ సవ్యంగా సాగితే ధోనీ బీజేపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది.

సీఎం అభ్యర్థిగా:

సీఎం అభ్యర్థిగా:

ఈ ఏడాది చివరిలో జార్ఖండ్ రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆలోపే ధోనీని బీజేపీలో చేర్పించుకుని ఆయన్నే జార్ఖండ్ సీఎం అభ్యర్థిగా ప్రమోట్ చేయాలనే ఆలోచనతో కమలనాథులు ఉన్నట్లు సమాచారం. ధోనీకి మెరుగైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయని బీజేపీ భావిస్తోంది. ఒకవేళ ధోనీ కమలం పార్టీ కండువా కప్పుకుంటే బీజేపీ తిరిగి అధికారంలోకి సునాయాసంగా వస్తుందనే నమ్మకం బీజేపీ నేతల్లో వ్యక్తమవుతోంది.

Story first published: Saturday, July 13, 2019, 14:25 [IST]
Other articles published on Jul 13, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+