వరల్డ్‌కప్: ప్రాక్టీస్ సెషన్‌లో బంతిని బౌండరీ దాటించిన ధోని (వీడియో)

హైదరాబాద్: ఐసీసీ వరల్డ్‌కప్ టోర్నీలో భాగంగా కోహ్లీసేన జూన్ 5(బుధవారం) దక్షిణాఫ్రికాతో తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్ కోసం టీమిండియా ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆటగాళ్ల ప్రాక్టీస్‌కు సంబంధించిన వివరాలను బీసీసీఐ ఎప్పటికప్పుడు ట్వీట్‌ర్‌లో అభిమానులతో పంచుకుంటోంది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోన్న ధోని
తాజాగా, సోమవారం నెట్స్‌లో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోన్న వీడియోని బీసీసీఐ తమ ట్విటర్‌లో పోస్టు చేసింది. ధోని బంతిని చాలా బలంగా బాదుతున్నాడంటూ ధోని ప్రాక్టీస్ చేస్తోన్న వీడియోని అభిమానులతో పంచుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

భారత విజయాల్లో ధోనినే కీలకం
ఈ వరల్డ్‌కప్‌లో భారత విజయాల్లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కీలకం కానున్నాడు. కోచ్ రవిశాస్త్రి సైతం ధోనిపై ప్రశంసల వర్షం కురిపించాడు. ధోని సలహాలు కెప్టెన్ కోహ్లీకి ఎంతో అవసరమని అన్నాడు. 341 అంతర్జాతీయ వన్డేలాడిన ధోనికి ఇది నాలుగో వరల్డ్‌కప్ కావడం విశేషం.

ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ సఫారీలు ఓటమి
మరోవైపు ఈ టోర్నీలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ సఫారీలు ఓటమిపాలయ్యారు. పేసర్ లుంగి ఎంగిడి గాయం కారణంగా టీమిండియాతో మ్యాచ్‌కు దూరమయ్యాడు. కాగా, వరల్డ్‌కప్‌లో భారత్‌పై సఫారీ జట్టుకు మెరుగైన రికార్డు ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. ఇప్పటివరకూ ఇరు జట్లు నాలుగు సార్లు తలపడగా మూడు సార్లు దక్షిణాఫ్రికానే విజయం సాధించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications