అరుదైన సన్నివేశం.. లండన్‌లో ధోనీ క్రేజ్ చూసారా!! (వీడియో)

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ఉండే క్రేజే వేరు. కెరీర్ ప్రారంభం నుండి తన బ్యాటింగ్, కీపింగ్‌తో అభిమానుల మనసును దోచుకున్నాడు. ఇక టీ20 ప్రపంచకప్ (2007), వన్డే ప్రపంచకప్ (2001) టీమిండియాకు అందించడంతో ఈ సంఖ్య మరింత పెరిగింది. కేవలం భారత దేశంలోనే కాదు ధోనీకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం
బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్:
ధోనీ మైదానంలో ఉన్నా కూడా అభిమానులు బారికేడ్స్ దాటి మరీ అతన్ని కలిసి సంతోషపడుతుంటారు. అయితే బయటి దేశంలో కూడా ఎంతమంది అభిమానులు ఉన్నారో మరోసారి రుజువైంది. ప్రపంచకప్‌లో భాగంగా శనివారం న్యూజిలాండ్‌తో టీమిండియా ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా బౌలింగ్ చేస్తుండగా.. ధోనీ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేశాడు.
అభిమానుల కేరింతలు:
ధోనీని బౌండరీ లైన్ దగ్గర చూడగానే స్టేడియంలోని అభిమానులు 'ధోనీ.. ధోనీ.. ధోనీ..' అంటూ కేరింతలు కొట్టారు. ఈ మ్యాచ్‌లో వికెట్‌కీపర్ బాధ్యతలు దినేశ్ కార్తిక్ తీసుకున్నాడు. ఎప్పటికీ ధోనీ వికెట్‌కీపర్‌గా చేయడంతో.. అభిమానులు అతన్ని దగ్గరగా చూసే అవకాశం రాలేదు. అయితే ఈ మ్యాచ్‌లో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ధోనీని దగ్గరగా చూడడంతో అభిమానులు ఆనందంలో కేరింతలు కొట్టారు.

ధోనీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు:
దీనికి సంబంధించిన వీడియోను ఓ అభిమాని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన మహీ అభిమానులు కూడా ఖుషీ అవుతున్నారు. అభిమానులు తమదైన స్థాయిలో కామెంట్లు పెడుతున్నారు. 'ఎప్పటికీ అతనో గొప్ప లీడర్', 'ఇది అరుదైన సన్నివేశం', 'ఇంగ్లాండ్ గడ్డ మీద కూడా ధోనీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు' అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications