
భారత మాజీ కెప్టెన్, వికెట్‌కీపర్ మహేంద్రసింగ్ ధోనీ అవమానకరమైన రీతిలో క్రికెట్ నుంచి తప్పుకుంటున్నాడు అని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.. పాకిస్తాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి ఫావాద్ హుస్సెన్ చౌదరీ మరో ట్వీట్ చేసి టీమిండియాపై ఉన్న కోపంను బయటపెట్టాడు. ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సెమీఫైనల్లో టీమిండియా 18 పరుగుల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
టీమిండియా ఓడిపోవడానికి అన్ని విధాల అర్హమైనదే అంటూ ఫావాద్ పేర్కొన్నాడు. అంతేకాదు ధోనీపై ఓ నెటిజన్ చేసిన వివాదస్పద ట్వీట్‌కు కూడా ఫావద్ రీట్వీట్ చేశాడు. 'జెంటిల్‌మెన్ ఆటను బెట్టింగ్, పక్షపాత ధోరణితో ధోని కలుషితం చేశాడు. ధోనీ అవమానకరమైన రీతిలో క్రికెట్ నుంచి తప్పుకుంటున్నాడు' అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. 'పాకిస్తాన్‌కు కొత్త నేస్తం న్యూజిలాండ్' అంటూ ఫావద్ రీట్వీట్ చేశాడు.
ప్రస్తుతం పాక్ మంత్రి చేసిన ట్వీట్ నెట్టింట్లో ట్రోలింగ్ అవుతోంది. ట్వీట్‌లో న్యూజిలాండ్ స్పెల్లింగ్‌ను ఫావద్ తప్పుగా రాసాడు. దీంతో నెటిజన్లు ఫావద్‌పై విరుచుకుపడుతున్నారు. 'న్యూజిలాండ్ స్పెల్లింగ్ కూడా తెలియని వ్యక్తి పాకిస్తాన్‌కు మంత్రి అని' ఆడుకుంటున్నారు. 'క్రికెట్‌కు ఎంతో సేవ చేసిన ధోనీని విమర్శించే హక్కు ఎవరికీ లేదు', 'పాక్ మరోసారి రాక్షసానందం పొందుతుంది', 'క్రికెట్ గురించి తెలియనోడు కూడా మాట్లాడుడేనా' అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఆస్ట్రేలియాపై టీమిండియా ఆర్మీ క్యాప్‌లు ధరించి మ్యాచ్ ఆడటంపై కూడా ఫావద్ వివాదస్పద వ్యాఖ్యలు చేసాడు.
న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సెమీఫైనల్లో ధోనీ (50; 72 బంతుల్లో 1x4, 1x6) రనౌట్ ఔట్ అయినా విషయం తెలిసిందే. ఐసీసీ తన అధికారిక ట్విటర్ వేదికగా ధోనీ రనౌట్ వీడియోను పంచుకుంది. హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ నటించిన 'టెర్మినేటర్' సినిమాలోని 'హస్త ల విస్త బేబీ' అనే డైలాగ్‌తో ఐసీసీ తన ఖాతాలో ఉంచింది. 'హస్త ల విస్త బేబీ' అంటే 'మళ్లీ కలుద్దాం' అని అర్థం. ధోనీ రనౌట్ వీడియోతో పాటు 'హస్త ల విస్త ధోనీ' అంటూ ఐసీసీ ట్వీట్ చేయడంపై భారత అభిమానుల తీవ్రంగా మండిపడుతున్నారు.