Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రపంచకప్‌లో టీమిండియానే ఫేవరెట్‌: మిథాలీ

ICC Cricket World Cup 2019: Mithali Raj explains why India are favourites to lift World Cup 2019

ఎక్కువ మంది మ్యాచ్‌ విన్నర్లు ఉన్న టీమిండియానే ప్రపంచకప్‌లో ఫేవరెట్‌ అని భారత మహిళా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ అభిప్రాయపడింది. హైదరాబాద్‌లో బ్రిటీష్‌ డిప్యూటీ హై కమిషనర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌తో ప్రపంచకప్‌పై మిథాలీ తన అభిప్రాయాలను పంచుకుంది. భారత్ ఎందుకు ఫెవరేట్ జట్టో తెలిపింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

మ్యాచ్‌ విన్నర్లు ఉన్నారు:

మ్యాచ్‌ విన్నర్లు ఉన్నారు:

మిథాలీ మాట్లాడుతూ... 'కెప్టెన్ విరాట్‌ కోహ్లీ జట్టును ముందుండి నడిపిస్తాడు. అతనికి ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శిఖర్ ధావన్‌లు మంచి సహకారం అందిస్తారు. జస్ప్రీత్‌ బుమ్రా లాంటి పేసర్, మంచి స్పిన్నర్లు జట్టులో ఉన్నారు. బ్యాట్స్‌మన్‌ భారీ స్కోర్లు చేస్తే.. ప్రత్యర్థిని పరుగులు చేయకుండా అడ్డుకున్న బౌలర్ల జట్టే మ్యాచ్‌లు గెలుస్తుంది. ఇందులో భారత జట్టు బాగుంది. ధోనీ రూపంలో సీనియర్ ఆటగాడు ఉన్నాడు. ఏ ఒక్క ఆటగాడి గురించో చెప్పడం కష్టం. టీమిండియాలో చాలా మంది మ్యాచ్‌ విన్నర్లు ఉన్నారు' అని మిథాలీ అన్నారు.

నా మద్దుతు భారత్‌కే:

నా మద్దుతు భారత్‌కే:

'ఐపీఎల్‌ ద్వారా అన్ని జట్లు, ప్రధాన ఆటగాళ్లు ఫామ్‌లో ఉన్నారు. అందరూ ప్రపంచకప్‌ కోసమే ఎదురు చూస్తున్నారు. వారందరూ కచ్చితంగా రాణిస్తారు. ప్రపంచకప్‌లో భారత్‌ ఫేవరెట్‌. ఎందుకంటే గత కొంత కాలంగా అన్ని ఫార్మాట్లలో టీమిండియా రాణిస్తోంది. ఇంగ్లాండ్‌కు కూడా కప్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. వన్డేల్లో 10-15 వరుస విజయాలు అందుకుంది. సొంత గడ్డపై ఆడడం కలిసొచ్చే అంశం. అయితే ఒక భారతీయురాలిగా నా మద్దుతు భారత్‌కే' అని మిథాలీ చెప్పుకొచ్చారు.

న్యూజిలాండ్‌తో తొలి ప్రా క్టీస్‌ మ్యాచ్‌:

న్యూజిలాండ్‌తో తొలి ప్రా క్టీస్‌ మ్యాచ్‌:

ఈనెల 25న ఓవల్‌ మైదానంలో న్యూజిలాండ్‌తో భారత్‌ తమ తొలి ప్రా క్టీస్‌ మ్యాచ్‌ ఆడుతుంది. ఆ తర్వాత 28న కార్డిఫ్‌లో రెండో ప్రాక్టీస్‌ మ్యాచ్‌ బంగ్లాదేశ్‌తో ఆడనుంది. జూన్‌ 5న దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్‌తో భారత్‌ తమ ప్రపంచకప్‌ పోరును మొదలు పెడుతుంది. అయితే టోర్నీ మాత్రం ఈ నెల 30న ఆరంభం కానుంది. టోర్నీలో భారత్ టైటిల్‌ ఫేవరెట్‌గా పోటీకి దిగుతున్నది. ధోనీ, కోహ్లీ, రోహిత్, ధావన్, కార్తీక్, షమీ, భువీ, జడేజా లాంటి సీనియర్లకు తోడు జాదవ్‌, బుమ్రా, చాహల్‌, రాహుల్‌, కుల్దీప్‌, శంకర్‌, హార్దిక్‌ లాంటి కుర్రాళ్లతో భారత్ పటిష్టంగా ఉంది.

 2019 ప్రపంచకప్‌ జట్టు:

2019 ప్రపంచకప్‌ జట్టు:

విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, విజయ్ శంకర్, మహేంద్ర సింగ్ ధోనీ (వికెట్ కీపర్), కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, యజువేంద్ర చాహాల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ.

Story first published: Thursday, May 23, 2019, 10:32 [IST]
Other articles published on May 23, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+