
15 వన్డేల్లో కేవలం ఒకదాంట్లో మాత్రమే
1 - సొంతగడ్డపై వరల్డ్‌కప్‌కు ముందు ఇంగ్లాండ్ ఆడిన 15 వన్డేల్లో కేవలం ఒకదాంట్లో మాత్రమే ఓడింది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం ఇంగ్లాండ్ సొంతగడ్డపై మొత్తం 17 వన్డేలాడగా అందులో రెండు రద్దు అయ్యాయి. ఇంగ్లాండ్ ఓడిన ఆ ఒక్క వన్డే కూడా భారత్ చేతిలోనే కావడం విశేషం. టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా ట్రెంట్ బ్రిడ్జి వేదికగా జరిగిన వన్డేలో ఇంగ్లాండ్ 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది.
7 - 1996 తర్వాత వరల్డ్‌కప్‌లో టెస్టు హోదా ఉన్న దేశాలతో ఇంగ్లాండ్ ఆడిన 27 మ్యాచ్‌ల్లో కేవలం ఏడింట మాత్రమే విజయం సాధించింది. ఇందులో 19 మ్యాచ్‌ల్లో ఇంగ్లాండ్ ఓడగా... 2011 వరల్డ్‌కప్‌లో టీమిండియాతో చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ టైగా ముగిసింది.

ఇంగ్లాండ్ ఖాతాలో అరుదైన రికార్డు
16 - సొంతగడ్డపై ఆడిన గత 16 మ్యాచ్‌ల్లో ఛేదనలో ఇంగ్లాండ్ విజయం సాధించింది. సొంతగడ్డపై ఈ విధమైన రికార్డుని కలిగి ఉన్న రెండో దేశంగా ఇంగ్లాండ్ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకుంది. 1983-1990 మధ్య కాలంలో వెస్టిండిస్ వరుసగా 18 మ్యాచ్‌ల్లో చేధనలో విజయం సాధించి ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది.
24.6 - వన్డేల్లో ఇంగ్లాండ్‌పై ఆడిన మ్యాచ్‌ల్లో ప్రతి 24.6 బంతులకు సఫారీ పేసర్ కగిసో రబాడ ఒక వికెట్ తీశాడు. ఇంగ్లాండ్‌పై ఇప్పటివరకు 7 మ్యాచ్‌లాడిన రబాడ 20.68 యావరేజితో 16 వికెట్లు పడగొట్టాడు.
66.14 - ఇంగ్లాండ్‌పై సఫారీ ఓపెనర్ క్వింటన్ డీకాక్ యావరేజి ఇది. ఇంగ్లాండ్‌పై ఇప్పటివరకు 8 మ్యాచ్‌లాడిన డీకాక్ 463 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ ఉంది.

మోర్గాన్ 200వసారి
200 - దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లాండ్ తరుపున ఇయాన్ మోర్గాన్ 200వ సారి బరిలోకి దిగుతున్నాడు. ఇంగ్లాండ్ తరుపున ఈ ఘనత సాధించిన మొదటి ఆటగాడు కూడా ఇతడే.
963 - ఈ మ్యాచ్‌లో దక్షిణాప్రికా ఆటగాడు హషీమ్ ఆమ్లా మరో 37 పరుగులు చేస్తే ఇంగ్లాండ్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో 1000 పరుగులు చేసిన ఆటగాడిగా అరుదైన ఘనత సాధిస్తాడు. ఇప్పటివరకు ఈ జాబితాలో దక్షిణాఫ్రికా ఆటగాడు జాక్వస్ కల్లిస్(1054) పరుగులు చేశాడు. ఇంగ్లాండ్‌పై మొత్తం 20 వన్డేలాడిన ఆమ్లా 53.5 యావరేజితో 963 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

ఇరు జట్ల మధ్య ఆరు మ్యాచ్‌లు
1999 - 1999లో జరిగిన వరల్డ్‌కప్‌లో ఓవల్ వేదికగా జరిగిన వన్డేలో ఇంగ్లాండ్‌పై సఫారీలు విజయం సాధించారు. ఈ వేదికలో ఇరు జట్లు ఇప్పటివరకు ఆరు సార్లు తలపడ్డాయి. ఇందులో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఇంగ్లాండ్ విజయం సాధించగా, 2003 తర్వాత నుంచి దక్షిణాఫ్రికానే విజయం సాధిస్తూ వస్తుంది.
6977 - ఇయాన్ మోర్గాన్ మరో 23 పరుగులు చేస్తే యూరప్ నుంచి వన్డేల్లో 7000 పరుగులు చేసిన మొదటి ప్లేయర్‌గా చరిత్ర సృష్టిస్తాడు.


Click it and Unblock the Notifications












