గుప్టిల్ ప్రపంచకప్ ప్రయాణం: పేలవ బ్యాటింగ్, కీలక రనౌట్‌లు, విషాదకర ఓవర్‌ త్రో

ICC Cricket World Cup 2019, Martin Guptills World Cup story: Poor run with the bat, crucial run-outs and a heartbreaking overthrow

న్యూజిలాండ్‌ విధ్వంసక ఓపెనర్‌ మార్టిన్‌ గప్తిల్‌కు 2019 ప్రపంచకప్‌ ఓ పీడకల. ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైనల్లో గప్తిల్‌ విఓసిరిన ఓవర్ త్రో కివీస్‌ ఆశలపై నీళ్లు జల్లింది. అనుకోకుండా బంతి స్టోక్స్‌ బ్యాటుకు తగిలి బౌండరీ దాటినా.. అక్కడే మ్యాచ్ మలువు తిరిగింది. గప్తిల్‌ కావాలని చేయకపోయినా కివీస్ పాలిట యముడిలాగా మారాడు. అయితే ప్రపంచకప్‌లో గప్తిల్‌ బ్యాట్స్‌మన్‌గా విఫలమయినా.. ఫీల్డర్‌గా మాత్రం అందరినీ ఆకట్టుకున్నాడు. గుప్టిల్ ప్రపంచకప్-2019 ప్రయాణం ఓసారి చూస్తే!!.

టోర్నీ మొత్తం 186 పరుగులు:

టోర్నీ మొత్తం 186 పరుగులు:

ఈ టోర్నీలో కివీస్‌ తొలి మ్యాచ్ శ్రీలంకతో తలపడింది. 137 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో గప్తిల్‌ 51 బంతుల్లోనే 73 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆ ఒక్క మ్యాచ్ తప్ప గప్తిల్‌ పరుగులు చేయడంలో విఫలమయ్యాడు. వరుసగా 25, 0, 35, 0, 5, 20, 8, 1, 19 పరుగులు మాత్రమే చేశాడు. మొత్తం ఈ టోర్నీలో 186 పరుగులు చేసి విఫలమయ్యాడు. 2015 ప్రపంచకప్‌లో డబుల్‌ సెంచరీ చేసిన గప్తిల్‌.. ఓపెనర్‌గా బరిలోకి దిగి ఈ పరుగులు చేయడం అతను ఎంత చెత్తగా ఆడాడో తెలుపుతుంది.

మెరుపు రనౌట్‌:

మెరుపు రనౌట్‌:

బ్యాటింగ్‌తో కాకపోయినా తిరుగులేని ఫీల్డింగ్‌తో కివీస్‌ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో స్టీవ్‌ స్మిత్‌ క్యాచ్‌ను కళ్లుచెదిరే రీతిలో అందుకున్నాడు. షార్ట్‌ఫైన్‌ లెగ్‌లో క్యాచ్ పట్టిన గప్తిల్‌ను చూసి స్మిత్‌ షాకయ్యాడు. ఇక భారత్‌తో సెమీఫైనల్‌ మ్యాచులో అద్భుతమే చేసాడు. టీమిండియాను గెలిపించేందుకు పూనుకున్న ఎంఎస్ ధోనీని రనౌట్‌ చేసి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాడు. ఫైన్‌ లెగ్‌లోకి బంతిని పంపించిన ధోనీ.. ఒక పరుగు తీశాడు. అవతలి ఎండ్‌లో భువనేశ్వర్‌ ఉండటం, భారీ లక్ష్యం ఉండడంతో మళ్లీ స్ట్రైక్‌కు రావాలని రెండో పరుగుకు ప్రయత్నింస్తుండగా.. అత్యంత వేగంగా పరుగెత్తుకొచ్చి బంతి అందుకున్న గప్తిల్‌ రాకెట్‌ వేగంతో వికెట్లను గిరాటేసాడు. ఈ రనౌట్‌తో గప్తిల్‌ హీరో అయ్యాడు.

విషాదకర ఓవర్‌ త్రో:

విషాదకర ఓవర్‌ త్రో:

ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైనల్ ఓ పీడకల. ఛేదనలో ట్రెంట్‌ బౌల్ట్‌ వేసిన ఆఖరి ఓవర్‌లో స్టోక్స్‌ తొలి రెండు బంతులు డిఫెండ్‌ చేశాడు. మూడో బంతిని కళ్లుచెదిరే సిక్సర్‌గా మలిచాడు. దాంతో 3 బంతుల్లో 9 పరుగులు చేయాలి. నాలుగో బంతిని భారీ షాట్‌కు ప్రయత్నించినా.. బంతి బౌండరీ దాటలేదు. ఒక పరుగు పూర్తి చేసిన స్టోక్స్‌.. రెండో పరుగు కోసం ప్రయత్నం చేశాడు. అప్పటికే బంతి అందుకున్న గప్తిల్‌ నేరుగా వికెట్ల వైపు విసిరాడు. ఇదే సమయంలో క్రీజులోకి డైవ్‌ చేసిన స్టోక్స్‌ బ్యాటుకు తగిలిన బంతి బౌండరీకి వెళ్ళింది. దీంతో మొత్తం 6 పరుగులు వచ్చాయి. చివరి రెండు బంతుల్లో ఇంగ్లాండ్‌ విజయానికి 3 పరుగులు అవసరం కాగా రెండు పరుగులు చేయడంతో మ్యాచ్‌ టైగా ముగిసింది.

ఏడ్చుకుంటూ పిచ్‌పైనే:

ఏడ్చుకుంటూ పిచ్‌పైనే:

సూపర్‌ ఓవర్‌లో ఇంగ్లాండ్‌ 15 పరుగులు చేసింది. ఛేదనలో జేమ్స్‌ నీషమ్‌, మార్టిన్‌ గప్తిల్‌ క్రీజులోకి వచ్చారు. 5 బంతుల్లో 14 పరుగులు చేశారు. ఇక చివరి బంతికి కివీస్‌కు 2 పరుగులు కావాలి. క్రీజులో ఉన్న గప్తిల్‌.. ఆర్చర్‌ వేసిన ఫుల్‌ లెంగ్త్‌ బంతిని మిడ్‌ వికెట్‌ వైపు ఆడాడు. ఒక పరుగు తీసి రెండో పరుగుకు వెళుతుండగా.. ఫీల్డర్‌ జేసర్‌ రాయ్‌ బంతి అందుకొని జోస్‌ బట్లర్‌ వైపు విసిరాడు. బంతిని అందుకున్న బట్లర్‌ వికెట్లను గిరాటేశాడు. గప్తిల్‌ రనౌట్ అయ్యాడు. సూపర్‌ ఓవర్‌ సైతం టై కావడంతో మ్యాచ్‌లో ఎక్కువ బౌండరీలు కొట్టిన ఇంగ్లాండ్‌ను విజేతగా ప్రకటించారు. గప్తిల్‌ మోకాళ్లపై కూర్చొని ఏడ్చుకుంటూ పిచ్‌పైనే ఉండిపోయాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, July 17, 2019, 15:55 [IST]
Other articles published on Jul 17, 2019
POLLS
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Mykhel sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Mykhel website. However, you can change your cookie settings at any time. Learn more