'టాప్ ఆర్డర్ విఫలమైతే.. ఆదుకోవడానికి వాళ్లు సిద్ధంగా ఉండాలి'

ఇంగ్లాండ్ పిచ్‌లపై టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ విఫలమైతే లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఆదుకోవాలి, అందుకు వారు సిద్ధంగా ఉండాలి అని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సూచించాడు. ప్రపంచకప్‌లో భాగంగా శనివారం న్యూజిలాండ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా ఆదిలోనే వికెట్లు కోల్పోయి 179 పరుగుల స్కోర్ చేసింది. పాండ్య (30), జడేజా (54)లు ఆదుకున్నారు. టీమిండియా ప్రధాన బ్యాట్స్‌మెన్ అందరూ నిరాశపరిచారు.

లోయర్ ఆర్డర్ ఆదుకోవాలి:
టీమిండియా బ్యాటింగ్ గురించి కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... 'ఇంగ్లాండ్ పిచ్‌లపై కొన్నిసార్లు టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ పరుగులు చేయకపోవచ్చు. ఈ సమయంలో లోయర్ ఆర్డర్ ఆదుకుని మ్యాచ్‌ను ముందుకు తీసుకెళ్లాలి. అందుకు వారు సిద్ధంగా ఉండాలి. వార్మప్ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ ఒత్తిడిని తట్టుకొని నిలబడ్డారు. ఇది జట్టుకు లాభించే అంశమే' అని కోహ్లీ అన్నారు.

ప్రణాళికలు రచించలేదు:
'50 పరుగులకే కీలక 4 వికెట్లు కోల్పోయినా కూడా మా జట్టు 179 పరుగులు చేసింది. అలాంటి పిచ్‌పై అది పోరాడే స్కోరే, కానీ మేము విఫలమయ్యాం. మేం ప్రణాళికలు రచించలేదు. మా బౌలర్ల ప్రదర్శన బాగుంది. ఓవర్‌కి 4.5 సగటున పరుగులు ఇచ్చారు. ఆటలో ఫీల్డర్లు చురుగ్గా ఉండడం చాలా ముఖ్యం. అవకాశాలు వచ్చినప్పుడు అందిపుచ్చుకోవాలి. అది ఫీల్డర్ల చేతుల్లోనే ఉంటుంది. జట్టు అన్ని విభాగాల్లో మెరుగవ్వాల్సిన అవసరం ఉంది' అని కోహ్లీ పేర్కొన్నారు.

మొదటి ఇన్నింగ్స్‌లోనే బంతి స్వింగ్ అయింది:
'ఈ విజయం చాలా ప్రత్యేకం. కొత్త బంతి స్వింగ్‌కు సహకరించింది. అది స్పిన్నర్లకు మాత్రం అనుకూలించలేదు. రెండో ఇన్నింగ్స్ కన్నా మొదటి ఇన్నింగ్స్‌లోనే బంతి స్వింగ్ అయింది. హెన్రీ నికోల్స్ టాప్ ఆర్డర్‌తో పాటు మిడి ల్ఆర్డర్‌లోనూ పరుగులు చేయగలడు. లాథమ్స్ వేలికి గాయం కారణంగా కొలిన్ మన్రోకి ఓపెనింగ్ అవకాశం ఇచ్చాం. మా బ్యాటింగ్ లైనప్ స్థిరంగా ఉండేలా చూసుకుంటాం' అని విలియమ్సన్ అన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications