న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆరంభంలోనే శ్రీలంకకు షాక్: మొదటి బంతికి ఫోర్... రెండో బంతికి ఔట్

ICC Cricket World Cup 2019: Lahiru Thirimanne is back in the pavilion off the second ball bowled by Henry

హైదరాబాద్: కార్డిఫ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంకకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక మొదటి ఓవర్ రెండో బంతికే వికెట్ కోల్పోయింది. కివీస్ పేసర్ హెన్రీ బౌలింగ్‌లో తొలి బంతిని ఫోర్ బాదిన తిరుమానె ఆ తర్వాత రెండో బంతికి ఎల్బీగా వెనుదిరిగాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

హెన్రీ వేసిన రెండో బంతి నేరుగా బ్యాట్స్‌మన్ ప్యాడ్‌కి తగిలినప్పటికీ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. దీంతో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ వెంటనే రివ్యూ కోరగా థర్డ్ అంపైర్ పరిశీలించారు. ఈ రివ్యూలో బంతి బ్యాట్‌కు తాకకపోగా, నేరుగా వెళ్లి స్టంప్స్‌ను తాకుతున్నట్లు కనిపించడంతో తిరుమానెను ఔట్‌గా ప్రకటించారు.


దీంతో న్యూజిలాండ్ ఈ రివ్యూలో విజయవంతమైంది. అనంతరం క్రీజులోకి వచ్చిన కుశాల్ పేరీరాతో కలిసి కరుణరత్నె ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతున్నాడు. ప్రస్తుతం 8 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక వికెట్ నష్టానికి 46 పరుగులు చేసింది. ప్రస్తుతం కుశాల్ పెరీరా(29), కరుణరత్నె(11) పరుగులతో క్రీజులో ఉన్నారు.

1
43646

అంతకముందు టాస్ నెగ్గిన న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బ్లండెల్‌ తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. కివీస్ జట్టు ఒక స్పిన్నర్, ఇద్దరు ఆల్‌రౌండర్‌లను తీసుకుంది. లంక సీనియర్ బౌలర్లు నువాన్ ప్రదీప్, సౌథీలకు చోటు దక్కలేదు.

{headtohead_cricket_4_7}

జట్ల వివరాలు:
శ్రీలంక:
దిముత్ కరుణరత్నె (కెప్టెన్), తిరిమన్నె, కుషల్ పెరెరా, కుషల్ మెండిస్, మాథ్యూస్, ధనంజయ డిసిల్వా, తిసార పెరెరా, జీవన్ మెండిస్, లక్మల్, ఇసురు ఉడాన, మలింగ.

న్యూజిలాండ్:
గుప్తిల్, మున్రో, విలియమ్సన్ (కెప్టెన్), టేలర్, లాథమ్, నీషమ్, గ్రాండ్‌హోమ్, శాంట్నర్, ఫెర్గూసన్, హెన్రీ, బౌల్ట్.

Story first published: Saturday, June 1, 2019, 18:26 [IST]
Other articles published on Jun 1, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X