'జట్టు కోసం ఏ స్థానంలోనైనా ఆడేందుకు సిద్ధం'

జట్టు కోసం ఏ స్థానంలోనైనా ఆడేందుకు సిద్ధం. ఐపీఎల్‌లో వెస్టిండీస్ విధ్వంసక ఓపెనర్ క్రిస్ గేల్‌తో ఆడటం వల్ల చాలా నేర్చుకున్నా అని టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్ తెలిపారు. 15 మంది సభ్యులతో కూడిన ప్రపంచకప్ జట్టులో కేఎల్ రాహుల్ చోటు దక్కించుకున్నాడు. ఎప్పటినుండో నాలుగో స్థానంపై తీవ్ర చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. నాలుగో స్థానంలో విజయ్‌శంకర్, కేఎల్ రాహుల్‌లను బీసీసీఐ ఎంపిక చేసినా.. ఇప్పటివరకు ఎవరు ఆడతారో స్పష్టత లేదు. మరోవైపు దినేష్ కార్తీక్ కూడా ఈ రేసులో ఉన్నాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

ఎక్కడైనా ఆడేందుకు సిద్ధం:
నాలుగో స్థానంలో ఆడటంపై రాహుల్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. 'జట్టులో సభ్యుడిగా ఉన్నప్పుడు కెప్టెన్, కోచ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటా. జట్టు కోసం ఎక్కడైనా ఆడేందుకు సిద్ధంగా ఉన్నా' అని రాహుల్ తెలిపాడు. 'గత కొద్ది నెలలుగా బాగా పరుగులు చేశా. ఇంగ్లండ్ లయన్స్‌తో సిరీస్ సందర్భంగా నా నైపుణ్యాలను మెరుగుపర్చుకున్నా. ఆసీస్‌తో టీ20 సిరీస్, ఐపీఎల్‌లో బాగా ఆడా. ఇప్పుడు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నా' అని రాహుల్ చెప్పారు.

ఫామ్ చాలా ముఖ్యం:
'గత డిసెంబర్‌లో భారత్, ఆసీస్ పర్యటనలో మెరుగ్గా ఆడలేకపోయా. ప్రతి క్రికెటర్ జీవితంలో ఫామ్ అనేది చాలా ముఖ్యం. అయితే కెరీర్‌లో ఒడుదొడుకులు కూడా ఉంటాయి. వీలైనంతమేరకు బాగా ఆడాలనే అనుకుంటా. బంతిని కొడితే బాగా ఆడినట్టు.. లేకపోతే ఫామ్ కోల్పోయినట్టు కాదు' అని రాహుల్ పేర్కొన్నాడు.

అక్కడి పరిస్థితులపై అవగాహన ఉంది:
'ఇంగ్లాండ్‌లో గతంలో పర్యటించిన అనుభవం ఉండటంతో అక్కడి పరిస్థితులపై అవగాహన ఉంది. గతంలో ఎన్ని పరుగులు చేశామని ఎవరూ పట్టించుకోరు. అక్కడ మంచిగా ఆడేందుకు సన్నద్దమయ్యా. గత రెండు నెలలుగా టీ20 క్రికెట్ ఆడాం. ఇప్పుడు వన్డేల్లో ఆడాల్సి ఉంది. ఫార్మాట్ల గురించి చింతించాల్సిన అవసరం లేదు. పరిస్థితులకు తగ్గట్టుగా ఆడటమే ముఖ్యం' అని రాహుల్ చెప్పుకొచ్చారు.

చాలా నేర్చుకున్నా:
'ఐపీఎల్‌లో క్రిస్ గేల్‌తో ఆడటం వల్ల చాలా నేర్చుకున్నా. బౌలర్లలపై ఎలా ఆధిపత్యం చెలాయించాలో అతని బ్యాటింగ్ చూస్తే అర్ధమవుతుంది. గేల్ మంచి సలహాలు ఇచ్చాడు. అతనితో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది' అని రాహుల్ వివరించాడు. ఐపీఎల్ సీజన్-12లో 593 పరుగులతో రెండో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రాహుల్ నిలిచాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications