Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లో కేదార్ జాదవ్ ఆడతాడా?

ICC World Cup 2019:Kedar Jadhav In Doubt For India's World Cup 2019 Opener Against South Africa ?
ICC Cricket World Cup 2019: Kedar Jadhav in doubt for Indias World Cup opener against South Africa


గాయం నుంచి కోలుకున్న టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌ కేదార్ జాదవ్‌ ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లో ఆడతాడా? లేదా? అనే సందేహం కలుగుతోంది. బుధవారం సౌథాంప్టన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరగబోయే మ్యాచ్‌లో జాదవ్ ఆడతాడా లేదా అనే విషయంపై బీసీసీఐ, కోచ్, కెప్టెన్ విరాట్ కోహ్లీలు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. దీంతో జాదవ్ విషయమై ఇంకా సందిగ్ధత నెలకొంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

తొలి మ్యాచ్‌ ఆడేనా:

ఈ ప్రపంచకప్‌లో అన్ని జట్ల ఆటగాళ్లు గాయాలపాలయ్యారు. ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఆర్చర్, మోర్గాన్ గాయపడ్డా.. కోలుకుని మ్యాచులు ఆడుతున్నారు. బంగ్లా కెప్టెన్ మోర్తజా కూడా ఆదివారం బరిలోకి దిగాడు. దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాళ్లు ఆమ్లా, స్టెయిన్, ఎంగిడిలు గాయపడ్డారు. ఆమ్లా, స్టెయిన్ ఫిట్‌నెస్‌ సాధించినా.. దక్షిణాఫ్రికా వారిని ఆడించే సాహసం చేయలేదు. జాదవ్ కూడా పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాడని జట్టు జాయమాన్యం, చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పష్టం చేశారు. అయితే జాదవ్‌ను తొలి మ్యాచ్‌లో ఆడించే సాహసం టీం మేనేజ్మెంట్ చేస్తుందా? లేదా? చూడాలి. తొలి మ్యాచ్‌తో జాదవ్ గాయం, నాలుగో స్థానంపై స్పష్టత రానుంది.

జిమ్‌లో కసరత్తులు:

ప్రాక్టీస్‌ సెషన్లలో జాదవ్ ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాటింగ్‌ చేసాడు. మరోవైపు బౌలింగ్‌ కూడా ప్రాక్టీస్ చేశాడు. మరోవైపు ఆదివారం కెప్టెన్ విరాట్‌ కోహ్లీతో పాటు కేదార్‌ జాదవ్ జిమ్‌లో కసరత్తులు కూడా చేసాడు. దీంతో అతడు గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడని తెలుస్తోంది. ఇంగ్లాండ్ పిచ్‌లు కాబట్టి జాదవ్ ఇంకా పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ సాధించాల్సిన అవసరం ఉంది.

ఫీల్డింగ్ చేస్తుండగా గాయం:

ఫీల్డింగ్ చేస్తుండగా గాయం:

ఐపీఎల్‌ చివరి లీగ్ మ్యాచ్‌లో భాగంగా మొహాలీ వేదికగా పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా జాదవ్‌ భుజానికి గాయమైన విషయం తెలిసిందే. గాయం కారణంగా చెన్నై తరపున సెమీఫైనల్స్‌, ఫైనల్‌ మ్యాచ్‌ ఆడలేదు. జాదవ్ ప్రపంచకప్‌లో మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌గానే కాకుండా బౌలింగ్‌ పరంగా జట్టుకు ఉపయోగపడనున్నాడు. భారత్ తరపున జాదవ్‌ 59 వన్డేలలో 1174 పరుగులు చేసాడు. ఇందులో రెండు సెంచరీలు, ఐదు అర్ధ సెంచరీలు ఉన్నాయి. మరోవైపు 27 వికెట్లు కూడా తీసాడు.

Story first published: Monday, June 3, 2019, 12:12 [IST]
Other articles published on Jun 3, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+