Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియాకు ఊరట.. కోలుకున్న జాదవ్‌

ICC Cricket world Cup 2019 : Kedar Jadhav Declared Fit For ICC Cricket World Cup 2019 || Oneindia
ICC Cricket World Cup 2019: Kedar Jadhav declared fit for ICC World Cup 2019

ప్రపంచకప్‌కు ముందు టీమిండియాకు ఊరట లభించింది. టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌ కేదార్ జాదవ్‌ గాయం నుంచి కోలుకున్నాడు. గురువారం జాదవ్‌కి ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహించగా.. అతను ఫిట్‌గా ఉన్నట్లు తేలింది. ఈ విషయాన్నీ టీమిండియా ఫిజియో పాట్రిక్‌ ఫర్హార్ట్‌ స్పష్టం చేశాడు. కీలక ప్రపంచకప్‌ ఉన్న నేపథ్యంలో అతడు కోలుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

జాదవ్‌ ఫిట్‌నెస్‌ రిపోర్టులను ఫిజియో పాట్రిక్‌ ఫర్హార్ట్‌ బీసీసీఐకి అందించాడు. ఫిట్‌నెస్‌ రిపోర్టులు అనుకూలంగా రావడంతో.. మే 22న ఉదయం మిగతా జట్టు సభ్యులందరితో కలిసి జాదవ్‌ ఇంగ్లాండ్‌ వెళ్లడానికి సిద్ధమవుతున్నాడు. దీంతో నిన్నటి వరకు జాదవ్‌ ప్రపంచకప్‌లో ఆడుతాడా? లేదా? అనే అనుమానాలకు సమాధానం దొరికింది. ఐపీఎల్‌ చివరి లీగ్ మ్యాచ్‌లో భాగంగా జాదవ్‌ భుజానికి గాయమైన విషయం తెలిసిందే.

తాజాగా జరిగిన ఐపీఎల్‌లో కేదార్ జాదవ్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున మోస్తరు ప్రదర్శనే చేశాడు. అయితే జట్టు కష్టాల్లో ఉన్న రెండు, మూడు మ్యాచులలో తన బ్యాటింగ్ పవర్ చూపించాడు. ప్రపంచకప్‌లో మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌గానే కాకుండా బౌలింగ్‌ పరంగా జట్టుకు ఉపయోగపడనున్నాడు. జాదవ్‌ 59 వన్డేలలో 1174 పరుగులు చేసాడు. ఇందులో రెండు సెంచరీలు, ఐదు అర్ధ సెంచరీలు ఉన్నాయి. మరోవైపు 27 వికెట్లు కూడా తీసాడు.

Story first published: Saturday, May 18, 2019, 15:01 [IST]
Other articles published on May 18, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+