For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తొలి వరల్డ్‌కప్ సెంచరీ: పాకిస్థాన్‌పై జో రూట్ అరుదైన ఘనత

ICC Cricket World Cup 2019: Joe Root Scored 1st Century of This World Cup

హైదరాబాద్: ట్రెంట్ బ్రిడ్జి వేదికగా సోమవారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఆటాగాడు జో రూట్ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో జో రూట్ 97 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. వరల్డ్‌కప్‌లో జో రూట్‌కు ఇదే తొలి సెంచరీ కావడం విశేషం.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఇక, ఇంగ్లాండ్ తరుపున ఇప్పటివరకు మొత్తం 134 వన్డేలాడిన జో రూట్ మొత్తం 15 సెంచరీలు సాధించాడు. సోమవారం పాక్‌పై చేసిన సెంచరీ చేధనలో ఆరోది కావడం విశేషం. వన్డేల్లో రూట్ అత్యధిక స్కోరు 133 నాటౌట్. అంతేకాదు టెస్టుల్లో ఇంగ్లాండ్ జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్వవహారిస్తున్నాడు.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 348 పరుగులు చేసింది. అనంతరం 349 పరుగుల లక్ష్య చేధనలో ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 334 పరుగులకే పరిమితమైంది. దీంతో ఆతిథ్య జట్టు 14 పరుగుల తేడాతో ఓడిపోయింది.

నిరాశపరిచిన ఓపెనర్ జాసన్ రాయ్

నిరాశపరిచిన ఓపెనర్ జాసన్ రాయ్

ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఓపెనర్‌ జాసన్‌ రాయ్‌(8) తీవ్రంగా నిరాశపరిచాడు. షాదాబ్‌ ఖాన్‌ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో ఓపెనర్ జాసన్‌ రాయ్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ తర్వాత జానీ బెయిర్‌స్టో (32), జో రూట్‌ నిలకడగా ఆడటంతో ఇంగ్లాండ్‌ 8.5 ఓవర్లకు వికెట్ నష్టానికి 60 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది.

విజృంభించిన పాక్ బౌలర్లు

విజృంభించిన పాక్ బౌలర్లు

ఆ తర్వాత పాక్ బౌలర్లు విజృంభించి మూడు వికెట్లు పడగొట్టారు. బెయిర్‌స్టోను వాహబ్‌ రియాజ్‌, మోర్గాన్‌ (9)ను హఫీజ్‌, స్టోక్స్‌ (13)ను మాలిక్‌ ఔట్‌ చేయడంతో ఇంగ్లాండ్‌ 118/4తో కష్టాల్లో పడింది. ఈ సమయంలో జో రూట్‌, బట్లర్‌లు జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. వీర్దిదరూ స్కోర్‌ బోర్డు వేగం పెంచారు.

సెంచరీలతో మెరిసిన రూట్, బట్లర్

సెంచరీలతో మెరిసిన రూట్, బట్లర్

అయితే జో రూట్‌ 104 బంతుల్లో 107(10 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ అనంతరం షాదాబ్‌ ఖాన్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే సెంచరీ సాధించిన బట్లర్‌ 76 బంతుల్లో 103(9 ఫోర్లు, 2 సిక్సర్లు)ను అమిర్‌ పెవిలియన్‌కు చేర్చడంతో ఇంగ్లాండ్‌ ఓటమి ఖాయమైంది. పాక్‌ బౌలర్లలో వాహబ్‌ రియాజ్‌ మూడు వికెట్లు తీయగా.. షాదాబ్‌, అమిర్‌లు చెరో రెండు వికెట్లు తీశారు.

పాక్ జట్టులో ముగ్గురు హాఫ్ సెంచరీలు

పాక్ జట్టులో ముగ్గురు హాఫ్ సెంచరీలు

అంతకముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ జట్టులో ఇమామ్ ఉల్ హక్‌ 58 బంతుల్లో 44(3 ఫోర్లు, 1 సిక్స్‌), బాబర్‌ అజామ్‌ 66 బంతుల్లో 63(4 ఫోర్లు, 1 సిక్స్‌), హఫీజ్‌ 62 బంతుల్లో 84(8 ఫోర్లు, 2 సిక్సర్లు), సర్పరాజ్‌ అహ్మద్‌ 44 బంతుల్లో 55(5 ఫోర్లు)లు రాణించడంతో పాక్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్లానికి 348 పరుగులు చేసింది.

వరల్డ్‌కప్‌లో తొలి సెంచరీ ఎవరిపై ఎప్పుడు:

వరల్డ్‌కప్‌లో తొలి సెంచరీ ఎవరిపై ఎప్పుడు:

డెనిస్ అమిస్ (ENG) 137 vs ఇండియా (1975)

గోర్డాన్ గ్రీన్డిజ్ (WI) 106* vs ఇండియా (1979)

ఆలెన్ లాంబ్ (ENG) 102 vs న్యూజిలాండ్ (1983)

జావేద్ మియాందాద్ (PAK) 103 vs శ్రీలంక (1987)

మార్టిన్ క్రౌనే (NZ) 100* vs ఆస్ట్రేలియా (1992)

నాథన్ అష్ట్లే (NZ) 101 vs ఇంగ్లాండ్ (1996)

సచిన్ టెండూల్కర్ (IND) 140 vs కెన్యా (1999)

బ్రియాన్ లారా (WI) 116 vs దక్షిణాఫ్రికా (2003)

రికీ పాంటింగ్ (AUS) 113 vs స్కాట్లాండ్ (2007)

వీరేంద్ర సెహ్వాగ్ (IND) 175 vs బంగ్లాదేశ్ (2011)

ఆరోన్ పించ్ (AUS) 135 vs ఇంగ్లాండ్ (2015)

Story first published: Tuesday, June 4, 2019, 13:08 [IST]
Other articles published on Jun 4, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+