Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

స్టడీ హ్యాండ్‌ చాలెంజ్‌ ఓడిపోయిన పాండ్యా, బుమ్రా (వీడియో)

ICC Cricket World Cup 2019: Jasprit Bumrah, Hardik Pandya takes the steady hand challenge - Watch

ప్రపంచకప్‌ 2019 వేటలో టీమిండియా ఆటగాళ్లు ఉన్నారు. శనివారం ఓవల్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వార్మప్‌ మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. అయితే అంతకుముందు రోజు టీమిండియా ఆటగాళ్లు ఆటవిడుపు కోసం స్టడీ హ్యాండ్‌ చాలెంజ్‌లో పాల్గొన్నారు. ఈ చాలెంజ్‌లో టీమిండియా ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా, జఫ్రీత్ బుమ్రాలు ఓడిపోయారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

స్టడీ హ్యాండ్‌ చాలెంజ్‌లో అంటే.. ఎత్తుపల్లాలు కలిగిన ఒక ఆట వస్తువును ఒక వైపు నుంచి మరొక వైపుకు చేతితో పట్టిన రింగుతో తాకుండా ఆడాలి. ఈ ఆటతో ఆటగాళ్లలో ఏకాగ్రత, స్థిరత్వం ఏ మేరకు ఉందో తెలుస్తుంది. మొదటగా ఈ చాలెంజ్‌లో పాల్గొన్న పాండ్యా మొదటి దానికోసం ప్రయత్నిస్తుండగా రింగు ఆ వస్తువుకు తగలడంతో ఓడిపోయాడు. అనంతరం బుమ్రా కూడా మొదటి దానికోసం ప్రయత్నిస్తుండగా రింగు ఆ వస్తువుకు తగిలింది. ఇద్దరు ఒక్కకి కూడా పూర్తి చేయలేదు. అయితే అంతకుముందు ఈ చాలెంజ్‌లో పాల్గొన్న రోహిత్ మూడు పూర్తి చేసాడు.

దీనికి సంబంధించిన వీడియోను ఐసీసీ తన అధికారిక ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. అభిమానులు పాండ్యా, బుమ్రాలపై సరదా కామెంట్లు కురిపిస్తున్నారు. ఐపీఎల్-12లో అదరగొట్టిన పాండ్యా, బుమ్రాలు.. తొలి వార్మప్‌ మ్యాచ్‌లో కూడా రాణించారు. ఈ నెల 28న బంగ్లాదేశ్‌లతో టీమిండియా రెండో వార్మప్‌ మ్యాచ్‌ ఆడనుంది. ప్రపంచకప్‌ సమరం మాత్రం జూన్‌ 5న దక్షిణాప్రికాతో ప్రారంభమవనుంది.

Story first published: Sunday, May 26, 2019, 13:25 [IST]
Other articles published on May 26, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+