
గాయపడిన టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ జిమ్‌లో ఎక్కువ సమయం గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే చేతికి ప్లాస్టర్ వేసుకుని జిమ్‌లో తీవ్ర కసరత్తు చేస్తున్నాడు. దీంతో గాయం నుంచి కోలుకుంటాననే ఆత్మవిశ్వాసంను ధావన్ వ్యక్తం చేస్తున్నాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా ధావన్ ఎడమ బొటన వేలికి గాయమైంది. గాయం అయినా నొప్పిని భరిస్తూ.. సెంచరీ చేసాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
మ్యాచ్ అనంతరం పరీక్షలు నిర్వహించగా బొటన వేలు విరిగడంతో మూడు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు తేల్చారు. దీంతో ప్రపంచకప్‌లోని కొన్నిమ్యాచ్‌లకు ధావన్ దూరయ్యాడు. భారత అభిమానులు ధావన్ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్ధించారు. ఈ విషయమై ధావన్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు.
'గాయం పరిస్థితులు ఓ పీడకలగా మిగిలిపోవచ్చు లేదా తిరిగి కోలుకోవడానికి అవకాశం ఉండొచ్చు. ఏదైనా జరగొచ్చు కానీ.. నేను కోలుకోవాలని సందేశాలను పంపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు' అని ధావన్ రాసుకొచ్చారు. అంతేకాదు జిమ్‌లో తాను చేస్తున్న కసరత్తులు చేస్తున్న వీడియోను జత చేసాడు.
ఇక కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ధావన్ తిరిగి ఆడతాడని ఆశాభావం వ్యక్తం చేసాడు. గురువారం న్యూజిలాండ్‌తో మ్యాచ్ రద్దయ్యాక కోహ్లీ మాట్లాడుతూ... 'ప్రస్తుతం ధావన్ వేలికి ప్లాస్టర్ వేసుంది. అతనికి రెండు మూడు వారాల విశ్రాంతి అవసరం. అనంతరం అతడి పరిస్థితి సమీక్షించి ఎలా స్పందిస్తాడో చూడాలి. ధావన్ త్వరగా కోలుకొని మిగతా లీగ్ మ్యాచ్‌లతో పాటు సెమీఫైనల్స్‌లో ఆడతాడు' అని కోహ్లీ ఆశాభావం వ్యక్తంచేశాడు.