For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్‌-పాక్‌ మ్యాచ్‌.. టీమిండియా ఫ్యాన్ పెళ్లి ప్రపోజల్

ICC Cricket World Cup 2019 : Indian Fan Proposing To His Girlfriend During Ind-Pak Match || Oneindia
ICC Cricket World Cup 2019: Indian Fan Proposing to His Girlfriend During India-Pakistan Match is Warming Hearts Online

ప్రపంచకప్‌లో భాగంగా జూన్ 16న భారత్‌-పాకిస్తాన్ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ 89 పరుగుల తేడాతో విజయం సాధించి జయకేతం ఎగురవేసింది. అయితే ఇదే మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం కూడా చోటుచేసుకుంది. గ్యాలరీలోని ఓ యువకుడు పెళ్లి ప్రపోజల్ చేసి తన ప్రియురాలి మనస్సును గెలుచుకున్నాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ మ్యాచ్‌లో భారత్‌ బ్యాటింగ్‌ చేస్తోంది. ఈ సమయంలో గ్యాలరీలో ఉన్న టీమిండియా ఫ్యాన్ విక్కీ.. అక్కడే కూర్చున్న అన్వితా అనే యువతికి ఉంగరాన్ని చూపించి పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. దీంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన అన్వితా అతడి ప్రేమను అగీకరించింది. అంతేకాదు గట్టిగా హత్తుకుని తన ప్రేమను వ్యక్తపరిచింది. అన్వితాకు విక్కీ ఉంగరం తొడిగిన అనంతరం ఇద్దరూ ముద్దు పెట్టుకున్నారు.

పక్కనే ఉన్న వారి స్నేహితులు వెల్ డన్ విక్కీ అంటూ ప్రోత్సహించారు. ఇక విక్కీ కెమెరా వైపు తమ జంటను చూపించాడు. ఈ సన్నివేశాన్ని చూసిన గ్యాలరీలోని ఇతర అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మ్యాచ్ టీమిండియాకే కాదు.. టీమిండియా అభిమానికి కూడా కలిసివచ్చింది. ఈ వీడియోను అన్వితా తన ట్విటర్‌లో పోస్టు చేసింది. 'ఇది భారత్‌-పాకిస్తాన్ మ్యాచ్‌లో జరిగింది' అని అన్వితా రాసుకొచ్చింది. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ వీడియో అందరిని ఆకట్టుకుంటోంది. నెటిజన్లు తమదైన స్టయిల్లో కామెంట్‌ చేస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో ఇంకో సంఘటన కూడా జరిగింది. కెనడాకు చెందిన దంపతులు కూడా తమ దుస్తులతో అందరి మనసులు గెలుచుకున్నారు. దంపతులు ఇరుదేశాల జెర్సీలను కలిపి కుట్టించుకున్న డ్రెస్‌ వేసుకోని రెండు జట్లకు మద్దతు తెలిపారు. భర్తది పాకిస్తాన్‌ కాగా.. భార్యది భారత్‌. కెనడాలో ఈ జంట నివసిస్తున్నారు. ఈ ఫొటో కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేసింది.

Story first published: Monday, June 24, 2019, 10:19 [IST]
Other articles published on Jun 24, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+