పాక్ సెమీస్‌కు చేరాలంటూ... కోహ్లీసేన సాయం కోరిన అక్తర్

హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ ముగింపు దశకు చేరుకోవడంతో సెమీస్ రేసు ఆసక్తికరంగా మారింది. వరుసగా దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌పై విజయాలు సాధించిన పాకిస్థాన్ ఒక్కసారిగా రేసులోకి దూసుకొచ్చింది. పాకిస్థాన్ ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో మూడింట విజయం సాధించి 7 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది.
టోర్నీలో భాగంగా టోర్నీలో భాగంగా తన తదుపరి రెండు మ్యాచ్‌ల్లో ఆప్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ జట్లతో తలపడనుంది. ఈ రెండు మ్యాచ్‌లు గెలిస్తే ఆ జట్టు నాకౌట్ దశకు వెళ్లే అవకాశముంది. అయితే, పాక్ నాకౌట్‌కు వెళ్లాలంటే మిగతా జట్ల ఫలితాలపై దాని భవితవ్యం ఆధారపడి ఉంది. బంగ్లాదేశ్, ఇంగ్లాండ్ ఆడే తదుపరి మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే పాకిస్థాన్ సెమీస్ ఆశలు కష్టమే.

అక్తర్ నోటివెంట ఓ ఆసక్తికర విషయం
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఓ ఆసక్తికర విషయాన్ని తెరపైకి తీసుకొచ్చాడు. పాకిస్థాన్ సెమీస్ చేరడానికి కోహ్లీసేన సాయం చేయాలని కోరాడు. "ప్రస్తుతం పాక్‌కు టీమిండియా సాయం చేయాలి. ఇంగ్లాండ్‌పై భారత్ గెలిస్తే ఆతిథ్య జట్టు టోర్నీ నుంచి వైదొలుగుతుంది. తదుపరి రెండు మ్యాచ్‌లు గెలిచి 11పాయింట్లతో పాక్ సెమీస్ చేరుతుంది" అని షోయబ్ అక్తర్ అన్నాడు.

తన యూట్యూబ్ ఛానెల్‌లో
గురువారం తన యూట్యూబ్ ఛానెల్‌లో అక్తర్ మాట్లాడుతూ పాక్ సెమీపైనల్‌కు చేరడంలో టీమిండియా సాయం చేస్తే... సెమీస్‌లో భారత్‌నే ఓడిస్తామని చెప్పాడు. కాగా, న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ విజయంలో కీలకపాత్ర పోషించిన బాబర్ ఆజమ్, సోహైల్‌పై అక్తర్ ప్రశంసల వర్షం కురిపించాడు. వారిద్దరూ బాగా ఆడారని, 1992లో కప్పు గెలిచిన పాక్‌ను ప్రస్తుత జట్టు గుర్తుకు తెస్తోందని చెప్పాడు.

బాసిత్ అలీ వివాదాస్పద వ్యాఖ్యలు
అక్తర్ సాయమడిగితే, పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచకప్‌లో పాక్ సెమీస్‌కు చేరకుండా అడ్డుకొనే లక్ష్యంతో శ్రీలంక, బంగ్లాదేశ్‌లతో మ్యాచ్‌లలో టీమిండియా ఓడిపోనుందని అన్నాడు. కరాచీలో ఓ స్థాని న్యూస్ ఛానల్ నిర్వహించిన టాక్ షో కార్యక్రమానికి హాజరయ్యారు బాసిత్ అలీ. ఈ సందర్భంగా యాంకర్ అడిగిన కొన్ని ప్రశ్నలకు చిత్ర, విచిత్రమైన సమాధానాలను ఇచ్చారు.
టీమిండియా కుట్ర పన్నుతోంది
ప్రస్తుత ప్రపంచకప్ టోర్నమెంట్‌లో పాకిస్తాన్ జట్టుపై టీమిండియా కుట్ర పన్నుతోందని ఆరోపించారు. సర్ఫరాజ్ అహ్మద్ జట్టును సెమీ ఫైనల్‌లోకి అడుగు పెట్టనీయకుండా అడ్డుకోవడానికి కోహ్లీసేన శాయశక్తులా ప్రయత్నిస్తోందని విమర్శించారు. దీనికోసం- భారత క్రికెట్ జట్టు తాను ఆడబోయే రెండు మ్యాచులను ఓడిపోతుందని కూడా జోస్యం చెప్పేశారాయన. దీనికి ప్రధాన కారణం.. పాకిస్తాన్ జట్టును చూసి టీమిండియా భయపడిపోతోందని అన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications