For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఎప్పుడు రిటైర్‌ అవుతానో తెలియదు.. షాకింగ్ కామెంట్స్ చేసిన ధోనీ

ICC Cricket World Cup 2019 : MS Dhoni Clears His Retirement Speculation || Oneindia Telugu
ICC Cricket World Cup 2019, India vs Sri Lanka: Breaks silence, People wanted him to retire before Sri Lanka game says MS Dhoni

భారత సీనియర్‌ క్రికెటర్‌, మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ తన రిటైర్మెంట్‌పై షాకింగ్ కామెంట్స్ చేసాడు. ఎప్పుడు రిటైర్‌ అవుతానో నాకే తెలియదు అని ధోనీ అన్నాడు. గత కొంతకాలంగా 'మిస్టర్‌ కూల్‌'పై వస్తున్న వార్తల నేపథ్యంలో ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. మెగా టోర్నీ ప్రపంచకప్‌ తుది దశకు చేరుకుంది. లీగ్ దశ నుండి నిష్క్రమించిన ఆయా జట్ల ఒక్కో సీనియర్‌ ఆటగాడు తమ క్రికెట్‌ కెరీర్‌కు గుడ్‌బై చెబుతున్నారు. దక్షిణాఫ్రికా స్టార్ స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహిర్‌, పాక్‌ సీనియర్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌లు ఆటకు గుడ్‌బై చెప్పారు.

ఇదే చివరి ప్రపంచకప్‌:

ఇదే చివరి ప్రపంచకప్‌:

తాజాగా తెలుగు తేజం, భారత మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ అంబటి రాయుడు కూడా క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో వెస్టిండీస్‌ విధ్వంసక ఓపెనర్, యూనివర్స్‌ బాస్ క్రిస్‌ గేల్‌ (40) చేరుతాడనుకున్నా.. ఇంకొంచెం సమయం పట్టేలా ఉంది. మరోవైపు ఎంఎస్ ధోనీకి ఇదే చివరి ప్రపంచకప్‌ అని.. ఆ తర్వాత రిటైర్ అవుతారనే వార్తలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ధోనీ స్పందించాడు.

ఎప్పుడు రిటైర్‌ అవుతానో తెలీదు:

ఎప్పుడు రిటైర్‌ అవుతానో తెలీదు:

శ్రీలంకతో ఈ రోజు భారత్ చివరి లీగ్‌ మ్యాచ్‌ ఆడుతున్న నేపథ్యంలో ఏబీపీ న్యూస్‌ చానెల్‌ రిపోర్టర్‌ ధోనీ ముందు రిటైర్మెంట్‌ అంశాన్ని ప్రస్తావించాడట. 'నేనెప్పుడు రిటైర్‌ అవుతానో నాకే తెలియదు. కానీ.. చాలా మంది రేపటి మ్యాచ్‌ (శ్రీలంకతో)కు మందే కెరీర్‌కు వీడ్కోలు పలకాలని కోరుకుంటున్నారు' అని ధోనీ చెప్పినట్టు సదరు ఛానెల్ పేర్కొంది.

క్లారిటీ లేదు:

క్లారిటీ లేదు:

ధోనీ రిటైర్మెంట్‌పై ఇప్పటివరకు భారత జట్టులోని ఏ సభ్యుడైనా, కోచింగ్ సిబ్బందైనా ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. 'ఎంఎస్ ధోనీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడో తెలియదు. కానీ.. ఈ ప్రపంచకప్ తర్వాత అతను ఆట కొనసాగించే అవకాశం లేదు. ధోనీ ఎవరికీ చెప్పకుండా మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ నుండి వైదొలుగుతూ అకస్మాత్తు నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు కూడా ఏం నిర్ణయం తీసుకుంటాడో చెప్పడం చాలా కష్టం' అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు అన్నారు.

కెప్టెన్, వైస్ కెప్టెన్ మద్దతు:

కెప్టెన్, వైస్ కెప్టెన్ మద్దతు:

ప్రపంచకప్‌ తర్వాతా కూడా ధోనీ తన ఆటను కొనసాగిస్తాడని మరో బీసీసీఐ అధికారి ఒకరు స్పష్టం చేశారు. ధోనీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నప్పుడే చాలా కష్టమైందని ఆ అధికారి పేర్కొన్నారు. మరోవైపు టీమ్‌మేనేజ్‌ మెంట్‌ ధోనీకి మద్దతుగా ఉంది. కెప్టెన్‌ విరాట్ కోహ్లీ, కోచ్‌ రవిశాస్త్రి, జట్టులోని ఆటగాళ్లు సైతం ధోనీ కొనసాగాలనే భావిస్తున్నారు. ధోనీ స్లో బ్యాటింగ్ చేసినా.. కెప్టెన్, వైస్ కెప్టెన్ మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే మాజీలు సచిన్, గుంగూలీల నుండి విమర్శలు ఎదుర్కొన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Story first published: Saturday, July 6, 2019, 12:22 [IST]
Other articles published on Jul 6, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+